Actress sameera sharif sensational comments about good touch and bad touch
Sameera Sharif: ఈ మధ్య కాలంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. కేవలం అమ్మాయిలు, మహిళలపైనే కాదు చిన్న పిల్లలపై కూడా ఇలాంటి దాడులు ఎక్కువవుతున్నాయి. వాటిని అరికట్టడం కోసమే ఫోక్సో లాంటి చట్టాలు కూడా తీసుకువచ్చారు. అయితే, వాటి కన్నా ముందే చిన్న పిల్లలకు ఇలాంటి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించాలని చెప్తోంది సీరియల్ నటి సమీరా షరీఫ్(Sameera Sharif).
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్తూ తిన్నతనంలో తాను ఎదుర్కున్న లైంగిగ వేధింపుల గురించి వివరించింది. చిన్నప్పుడు తనతో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్థించేవాడని, దాని గురించి తనకు తరువాత అర్థమయ్యింది అంటూ చెప్పింది. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. నా చిన్నతనంలో మేము రైల్వే కోటర్స్ ఉండేవాళ్ళం.
Jana Nayagan: ఇవాళే తీర్పు.. 32 అభ్యంతరాల సంగతేంటి.. జన నాయగన్ విడుదలవుతుందా?
అప్పుడు మా ఎదురింట్లోని ఆంటీ వాళ్ళ ఇంట్లోకి బంధువులు వచ్చేవారు. వారిలో ఒక అంకుల్ నన్ను బుగ్గలు గిల్లుతూ ముద్దు చేసేవారు. అది నాకు అప్పుడు అర్థం కాలేదు. అలాగే, చిన్నపిల్లలం అంతా కలిసి దాగుడుమూతలు ఆడుకునేవాళ్ళం. అందులో ఆ అంకుల్ కూడా జాయిన్ అయ్యేవారు. దాక్కోడానికి టెర్రస్ ఎక్కేవాళ్ళము. అక్కడకు ఎవరు వచ్చేవాళ్ళు కాదు.
అక్కడకు నన్ను తీసుకెళ్లి ముద్దుచేశావారు. చాలాసార్లు అది నాకు ఇబ్బందిగా అనిపించేది. తను నన్ను ముద్దు చేస్తున్నాడు అనుకునేదాన్ని. కానీ, తరువాత అర్థం అయ్యింది అతను తన కోరికలు తీర్చుకునేవాడు అని. అందుకే, పెద్దవాళ్ళు ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు వివరంగా చెప్పాలి. వాళ్లలో అవగాహన కల్పించాలి. వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన చెప్పుకోవడానికి, సపోర్ట్ చేయడానికి మేము ఉంన్నాము” అనే భరోసా ఇవ్వాలని చెప్పుకొచ్చింది సమీరా షరీఫ్. దీంతో సమీరా షరీఫ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.