Jana Nayagan: ‘జన నాయగన్‌’ రిలీజ్ కు లైన్ క్లియర్.. సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలంటూ ఆదేశాలు

'జన నాయగన్(Jana Nayagan)' సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయాలని మద్రాస్ హైకోర్టు సెన్సార్ బోర్డును ఆదేశించింది.

Jana Nayagan: ‘జన నాయగన్‌’ రిలీజ్ కు లైన్ క్లియర్.. సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలంటూ ఆదేశాలు

Madras High Court ordered censor board to certificate for 'Jana Nayagan' movie.

Updated On : January 9, 2026 / 12:30 PM IST
  • ‘జన నాయగన్‌’ సినిమాకు చెన్నై హైకోర్టులో ఊరట
  • సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయాలంటూ సీబీఎఫ్‌సీకి ఆదేశాలు
  • త్వరలోనే విడుదల తేదీ ప్రకటన

Jana Nayagan: తమిళ స్టార్ విజయ్‌ హీరోగా వస్తున్న ‘జన నాయగన్‌(Jana Nayagan)’ సినిమాకు చెన్నై హైకోర్టులో ఊరట లభించింది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్‌ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేయాలనీ సీబీఎఫ్‌సీకి సూచించించింది. ఈమేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది కోర్ట్.

Ramya: మగవాళ్ళు, కుక్కలు ఒకటే.. కంట్రోల్ చేయడం కష్టం.. కన్నడ నటి సంచలన కామెంట్స్

దీంతో, జన నాయగన్ మూవీ మేకర్స్ తోపాటు విజయ్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక కొత్త విడుదల తేదీపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. ఇక జన నాయగన్ సినిమాను దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మాస్ ఎంటర్టైనర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమా విడుదల అనేది విజయ్ ఫ్యాన్స్ కి చాలా ఎమోషనల్ గా మారింది.

దానికి కారణం జన నాయగన్ విజయ్ కి చివరి సినిమా కావడమే. ముందు చేసుకున్న ప్లాన్ ప్రకారం ఈ సినిమా జనవరి 9న విడుదల కావాలి. కానీ, సెన్సార్ అభ్యంతరాల కారణంగా సినిమా వాయిదా పడింది. ఆ అభ్యంతరాలకు ఒప్పుకోని మూవీ టీం కోర్టుకు వెళ్లారు. తాజాగా ఇదే విషయంపై కోర్టు తీర్పు వెల్లడించింది.