Ramya: మగవాళ్ళు, కుక్కలు ఒకటే.. కంట్రోల్ చేయడం కష్టం.. కన్నడ నటి సంచలన కామెంట్స్

మగవాళ్ళను కుక్కలతో పోల్చుతూ కన్నడ నటి రమ్య(Ramya) చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Ramya: మగవాళ్ళు, కుక్కలు ఒకటే.. కంట్రోల్ చేయడం కష్టం.. కన్నడ నటి సంచలన కామెంట్స్

Actress Ramya shocking comments, comparing men to dogs.

Updated On : January 9, 2026 / 12:25 PM IST
  • మగాళ్లను కుక్కలతో పోల్చిన కన్నడ నటి
  • ఎప్పుడు రేప్ చేస్తారో తెలియదు అంటూ కామెంట్స్
  • ఆమెపై కేసులు పెట్టాలి అంటూ నెటిజన్స్ ఫైర్

Ramya: దేశంలో వీధి కుక్కల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మనుషులపై కుక్కల దాడులు అధికం అవుతున్నాయని సుప్రీమ్ కోర్టు ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. వాటిని షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. అయితే, కోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలపై డాగ్ లవర్స్ న్యాయ పోరాటాం చేస్తున్నారు. వీరిలో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు.

Maa Inti Bangaram: ‘మా ఇంటి బంగారం’ టీజర్ వచ్చేసింది.. సమంత యాక్షన్ మోడ్.. అదరగొట్టేసిందిగా!

అలాగే స్టార్ హీరోలు, హీరోయిన్స్ కూడా కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కన్నడ నటి రమ్య(Ramya) ఈ వివాదంపై స్పదించింది. సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ పెట్టింది. ఆ పోస్టులో మగవాళ్ళను కుక్కలతో పోల్చింది. ‘మగాళ్లను, వాళ్ళ మనసులను అర్థం చేసుకోవడం కూడా కష్టమే. ఎప్పుడు రేప్ చేస్తారో, ఎవరిని చంపుతారో తెలుసుకోవడం కష్టం. మరి, వాళ్లందరినీ జైల్లో పెట్టాలా’ అంటూ రాసుకొచ్చింది.

దీంతో నటి రమ్య చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారమే రేపుతోంది. నెటిజన్స్ ఆమెపై మండిపడుతున్నారు. మనుషులకు, జంతువులకు తేడా లేదా. మగాళ్లను కుక్కలతో పోల్చడం ఏంటి? కొంతమంది చేసిన తప్పులకు మగజాతినే ఇలా అనడం అనేది దారుణమైన పోలిక. రమ్య వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ అవుతుంది. ఆమెపై కేసులు పెట్టాలి’ అంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో, ఈ వివాదం తీవ్రంగా మారేలా కనిపిస్తోంది. మరి నెటిజన్స్ చేస్తున్న ఈ కామెంట్స్ పై నటి రమ్య ఎలా స్పందిస్తుందో చూడాలి.

actress ramya shocking comments comparing men to dogs

actress ramya shocking comments comparing men to dogs