Samyuktha : బాలకృష్ణ హాస్పిటల్లో హీరోయిన్ సంయుక్త.. క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో..

తాజాగా సంయుక్త బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన సదస్సులో పాల్గొంది.

Actress Samyuktha Participated in Balakrishna Basavatarakam Cancer Hospital Awareness Program

Samyuktha : తెలుగులో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి దూసుకెళ్తున్న హీరోయిన్ సంయుక్త సేవా కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల్లో కూడా రెగ్యులర్ గా పాల్గొంటుంది.

తాజాగా సంయుక్త బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన సదస్సులో పాల్గొంది.

నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతోమందికి ఉచితంగా, తక్కువ ఖర్చుకే చికిత్స చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా బాలయ్య బసవతారకం హాస్పిటల్ తరపున బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హీరోయిన్ సంయుక్త పాల్గొంది.

సంయుక్త పింక్ క్యాప్ పెట్టుకొని క్యాన్సర్ అవగాహన గురించి మాట్లాడింది.

సంయుక్తతో పాటు హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది.

సంయుక్త ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి ఇలాంటి మంచి ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు సంతోషం వ్యక్తం చేసింది.

దీంతో క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడంతో సంయుక్తపై పలువురు అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.