Sheela Rajkumar : విడాకులు తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

ఇటీవల కాలంలో చాలామంది ప్రముఖులు విడాకులు తీసుకున్నారు. మరో నటి భర్త నుండి విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు చేసారు.

Sheela Rajkumar

Sheela Rajkumar : ఏ ఇండస్ట్రీ చూసిన సెలబ్రిటీల విడాకుల పరంపర కొనసాగుతోంది. తాజాగా కోలీవుడ్ నటి షీలా రాజ్‌కుమార్ భర్త నుండి విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

Vithika Sheru : వామ్మో.. ఈ హీరోయిన్ సిక్స్ ప్యాక్ చూశారా?

తమిళ నటి షీలా రాజ్‌కుమార్ విడాకుల ప్రకటన హాట్ టాపిక్‌గా మారింది. ‘వివాహ బంధం  నుండి విడిపోతున్నాను.. థ్యాంక్స్ అండ్ లవ్’ అంటూ భర్త చోళన్ పేరు ట్యాగ్ చేసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వైరల్‌గా మారింది. షీలా చోళన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్న చోళన్‌తో షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న సందర్భంలో షీలా ప్రేమలో పడ్డారట. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నారు. సముద్రం మధ్యలో పెళ్లి చేసుకుని మరీ వార్తల్లో నిలిచారు.

క్లాసికల్ డాన్సర్ అయిన షీలా రాజ్ కుమార్ 2016 లో అరుతళగన్ డైరెక్షన్ లో వచ్చిన ‘అరదు చినమ్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అసురవతం, నమ్మ విద్యాపిళ్లై సినిమాల్లో నటించారు. 2017 లో జీ తమిళ్ లో వచ్చిన ‘ఆశయ తమిళ దాత్యా’ అనే సూపర్ హిట్ సీరియల్‌లో షీలా ప్రధాన పాత్ర పోషించారు. ఈ సీరియల్ షీలా లైఫ్‌ను టర్న్ తిప్పిందని చెప్పాలి. జి.మోహన్ డైరెక్షన్‌లో వచ్చిన ద్రౌపది సినిమాలో షీలా నటించారు. ఆ తర్వాత మడోన్ అశ్విన్ డైరెక్షన్‌లో ‘మండేలా’ అనే సినిమాలో చేసారు. అయితే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాలేదు.

యానిమల్ సినిమాలో రష్మికకు కంటే ఎక్కువగా ఈ హీరోయిన్ కి పేరొస్తుంది? ఎవరు ఈ హీరోయిన్?

కార్తీక్ సుబ్బరాజ్ ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ లో ఎస్.జే.సూర్యకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా, బిచ్చగాడు 2 లో విజయ్ ఆంటోనీ చెల్లెలుగా నటించారు షీలా. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్న షీలా విడాకుల వార్త నెటింట్లో వైరల్ అవుతోంది. షీలా-చోళన్ బ్రేకప్‌కి కారణాలు ఇంకా తెలియలేదు.

ట్రెండింగ్ వార్తలు