Shilpa Shetty: నేను తప్పు చేశా.. కానీ అది సరైనదేనని అనుకుంటున్నా!

బాలీవుడ్ నటి, ఫిట్నెస్ మోడల్ శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా ఈ మధ్య తరచుగా వార్తలలో వినిపిస్తూ కనిపించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ను షేక్ చేసిన నీలి చిత్రాల కేసులో ఈ దంపతులు

Shilpa Shetty

Shilpa Shetty: బాలీవుడ్ నటి, ఫిట్నెస్ మోడల్ శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా ఈ మధ్య తరచుగా వార్తలలో వినిపిస్తూ కనిపించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ను షేక్ చేసిన నీలి చిత్రాల కేసులో ఈ దంపతులు కొన్ని రోజుల పాటు హాట్ టాపిక్ గా మారిపోయారు. భర్త రాజ్ కుంద్రా అరెస్టుతో కొద్దిరోజులు ఇంటికే పరిమితమైన శిల్పా ఈ మధ్యనే మళ్ళీ తనపనిలో పడింది. ఈ మధ్యనే సూపర్ డాన్స్ రియాలిటీ షో జడ్జిగా మళ్ళీ కెమెరా ముందుకొచ్చిన శిల్పా సోషల్ మీడియాలో కూడా మళ్ళీ యాక్టివ్ గా మారుతుంది.

కాగా, గురువారం సాయంత్రం శిల్పా పెట్టిన ఓ ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మిస్టేక్స్ పుస్తకం నుండి ఓ పేజీని ఫోటో తీసి షేర్ చేసిన శిల్పా అందులో ఉన్న గడిచిన జీవితంలో చేసిన తప్పులకు జీవితాంతం చెల్లించాల్సిందే అనే ఓ కొటేషన్ ను వివరించింది. ఇందులో తప్పుల గురించి మాట్లాడిన శిల్పా ‘అక్కడక్కడా కొన్ని తప్పులు చేయకుండా మన జీవితాలను ఆసక్తికరంగా మార్చుకోలేమని.. కాకపోతే అవి ప్రమాదకరమైన తప్పులు, ఇతర వ్యక్తులను బాధించే తప్పులు కాకూడదని మాత్రమే కోరుకోవాలని చెప్పింది.

జీవితంలో తప్పులు ఉంటాయని.. అయితే, వాటిని మనం మర్చిపోవాలనుకునే విషయాలుగా, ఒక సవాలుగా భావించే అనుభవాలుగా చూడాలని.. తప్పుల నుండి మనం నేర్చుకోవాల్సి ఉంటుందని ఆమె శిల్పా చెప్పుకొచ్చింది. నిజమే నేను తప్పులు చేయబోతున్నాను.. అందుకు నన్ను నేను క్షమించుకుంటూ వారి నుండి నేర్చుకుంటాను’ అంటూ శిల్పా నేను తప్పు చేశా.. కానీ అది సరైనదే అంటూ తన కథకు యానిమేటెడ్ స్టిక్కర్‌ను జోడించింది. ఇది భర్త రాజ్ కుంద్రా నీలి చిత్రాల వ్యవహారం, తన ఫిట్నెస్ సెంటర్ విషయంలో ఇద్దరి దగ్గర డబ్బు తీసుకొని మోసం చేసినట్లుగా శిల్పాపై ఆరోపణలు వెల్లువెత్తిన వ్యవహారంపైనే ఇలా స్పందించినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.