Mishan Impossible: తాప్సీ మిషన్ ఇంపాజిబుల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
చాలాకాలం తరవాత హీరోయిన్ తాప్సి మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ అనేక ప్రాజెక్టులను చేపట్టింది.
- Naresh Mannam
- Published On : February 28, 2022 / 04:28 PM IST
Mishan Impossible
Mishan Impossible: చాలాకాలం తరవాత హీరోయిన్ తాప్సి మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ అనేక ప్రాజెక్టులను చేపట్టింది. స్టార్స్ తో హై బడ్జెట్ ఎంటర్ టైనర్స్ చేయడమే కాకుండా మీడియం బడ్జెట్ సినిమాలను కూడా తీస్తోంది. అలా తెరకెక్కిందే మిషన్ ఇంపాజిబుల్. ఇందులో తాప్సీ పన్ను కథానాయికగా నటిస్తుండగా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వరూప్ ఆర్‌ఎస్‌జే దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.
Taapsee Pannu: పెద్ద స్టార్ కుటుంబంలో పుడితే.. ఆర్యన్ అరెస్ట్‌పై తాప్సీ
నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తుండగా, ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మార్క్ కె రాబిన్ సంగీతమందించిన ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ ప్రమోషన్ ఈ మధ్యనే ప్రారంభించిన యూనిట్.. ముందుగా `ఏధం గాలం` అనే లిరికల్ వీడియోను విడుదల చేసింది. దీనికి మ్యూజిక్ లవర్స్ నుండి మంచి స్పందన వచ్చింది.
Taapsee Pannu: భార్యపై భర్త రేప్ కేసు తీర్పు.. తాప్సి రియాక్షన్ ఇదే!
ఇక సినిమా విడుదలకి కూడా ముహూర్తం పెట్టేసిన మేకర్స్.. సోమవారం నాడు సినిమా రిలీజ్ డేట్‌కి సంబంధించి అప్‌డేట్‌ను ఇచ్చారు. ఈ వేసవిలో అపరిమిత వినోదాన్ని అందించడానికి `మిషన్ ఇంపాజిబుల్ ఏప్రిల్`1న థియేటర్లలోకి రానుంది. తిరుపతికి సమీపంలోని ఓ మారుమూల పల్లెటూరి నేపథ్యంలో సాగే కథాంశంతో ప్రేక్షకులను మైమరిపించే చిత్రంగా రూపొందింది.
