నన్ను గదిలోకి రమ్మని అతనితో చెప్పి పంపించారు వాళ్లు..

నటి వాణి భోజన్ తాజా ఇంటర్వూలో తనకెదురైన క్యాస్టింగ్ కౌచ్ సంఘటనల గురించి వివరించింది..

  • Publish Date - March 14, 2020 / 01:04 PM IST

నటి వాణి భోజన్ తాజా ఇంటర్వూలో తనకెదురైన క్యాస్టింగ్ కౌచ్ సంఘటనల గురించి వివరించింది..

వాణి భోజన్..
క్యాస్టింగ్ కౌచ్.. గతకొద్ది కాలంగా పలువురు నటీమణులు తమకెదురైన చేదు సంఘటనల గురించి నోరు విప్పుతున్నారు. చిన్మయి, శ్రీరెడ్డి వంటి వారు తమను ఇబ్బందులకు గురిచేసిన వారి గురించి కాస్త ఘాటుగానే విమర్శలు గుప్పించారు. తాజాగా నటి వాణి భోజన్ తనకెదురైన క్యాస్టింగ్ కౌచ్ ఘటనల గురించి ఓ ఇంటర్వూలో చెప్పింది.

అవకాశాల కోసం తనను కొందరు నిర్మాతలు పడకగదికి రమ్మన్నారని తీవ్ర ఆరోపణలు చేసింది. వివరాళ్లోకి వెళ్తే.. వాణి భోజన్ తమిళనాట అశోక్ సెల్వన్ హీరోగా నటించిన ‘ఓ మై కడవులే’ చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అతిథి పాత్రలో కనిపించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.

 

సినిమాల్లోకి రాకముందు ‘మాయ’ అనే టీవీ సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చింది. ‘దైవమగళ్’ సీరియల్‌తో పాపులర్ అయింది. అయితే తన షూటింగ్, డేట్స్ వంటి వ్యవహారాలు తన మేనేజర్ చూసుకునే వాడని.. మీ మేడమ్‌కి అవకాశమివ్వాలంటే అడ్జస్ట్ అవ్వాలని కొందరు.. పడగ్గదికొస్తదా చెప్పు.. ఇప్పుడే సినిమా ఫిక్స్ చేద్దాం అని కొందరు తన మేనేజర్‌తో చెప్పినట్టు తనకు చెప్పాడని వాణి భోజన్ తెలిపింది. క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో ఇటీవలే హాలీవుడ్ నిర్మాత హార్వీ విన్‌స్టీన్‌కు న్యూయార్క్ కోర్టు 23 సంవత్సరాల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే.