Vidyullekha Raman : వెడ్డింగ్ ఫొటోలు షేర్ చేసిన విద్యుల్లేఖ
తెలుగు, తమిళ్ సిినిమాలలో తన కామెడీతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన విద్యుల్లేఖ తన పెళ్లి ఫొటోలు షేర్ చేసింది..
- sekhar
- Published On : September 18, 2021 / 05:11 PM IST
Vidyullekha Raman
Vidyullekha Raman: తన నటనతో, కామెడీ టైమింగ్‌తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న పాపులర్ లేడీ కమెడియన్ విద్యుల్లేఖా రామన్ తన ప్రియుణ్ణి పెళ్లాడింది. గతేడాది లాక్‌డౌన్ సమయంలో విద్యుల్లేఖా బాగా సన్నబడింది. విద్యుల్లేఖ సన్నబడ్డటానికి కారణం ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతుండడమే అనే వార్తలు కూడా వచ్చాయి.
గత కొంతకాలంగా ఫిట్‌నెస్ నిపుణులు, న్యూట్రీషియన్ సంజయ్‌తో విద్యుల్లేఖా రామన్ ప్రేమలో ఉంది. ఇరు కుటుంబాల అంగీకారంతో 2020 ఆగస్టు 26న వీరి రోకా ఫంక్షన్ జరిగింది. సరిగ్గా ఏడాది తర్వాత 2021 ఆగస్టు 26న సంజయ్‌ను వివాహం చేసుకుందామె.
తమిళ, సిందీ సాంప్రదాయల ప్రకారం చెన్నైలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి మ్యారేజ్ గ్రాండ్‌గా జరిగింది. అయితే పెళ్లి ఫొటోలు మాత్రం బయటకి రాలేదు. రీసెంట్‌గా తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిందామె. విద్యుల్లేఖ రెడ్ కలర్ లెహంగాతో, సంజయ్ గోధుమరంగు షేర్వానీలో మెరిసిపోయారు.
‘సన్నగా మెరుపు తీగలా ఉన్నావ్.. మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు విద్యుల్లేఖకు విషెస్ తెలియజేస్తున్నారు. రీసెంట్‌గా మాల్దీవ్స్‌లో హనీమూన్ కూడా కంప్లీట్ చేసుకున్నానని, తెలుగు, తమిళ్ సినిమాల షూటింగ్స్‌లో పాల్గొనబోతున్నానని ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది విద్యుల్లేఖ.
