Actress Yami Gautam Summoned By Ed In Money Laundering Case
Yami Gautam: ఇటీవలే పెళ్లి చేసుకుని న్యూ లైఫ్ స్టార్ట్ చేసిన బాలీవుడ్ నటి యామీ గౌతమ్‌కి ముంబై ఈడీ షాక్ ఇచ్చింది. జూలై 7న విచారణకు హాజరుకావాలంటూ సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు.
మనీ లాండరింగ్ కేసులో యామీకి సమన్లు అందడం ఇది రెండో సారి. విదేశీ మారక నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు యామీకి సమన్లు ఇచ్చారు.
Yami Gautam : డైరెక్టర్‌ను పెళ్లాడిన హీరోయిన్ యామీ గౌతమ్..
ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌తో మోడలింగ్ ఫీల్డ్‌లో పాపులర్ అయిన యామీ ‘ఉల్లాస ఉత్సాహ’ అనే కన్నడ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది.. ‘విక్కీ డోనర్’ తో బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో రవిబాబు డైరెక్ట్ చేసిన ‘నువ్విలా’, అల్లు శిరీష్ ‘గౌరవం’, తరుణ్ ‘యుద్ధం’, నితిన్‌తో ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం హిందీలో మూడు చిత్రాలు చేస్తోంది యామీ గౌతమ్..