Adah Sharma The Kerala Story director Sudipto Sen admitted in hospital
The Kerala Story Director : అదా శర్మ (Adah Sharma) మెయిన్ లీడ్ లో నటించిన సినిమా ‘ది కేరళ స్టోరీ’. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రిలీజ్ కి బ్యాన్ ఎదురుకుంటూ పూర్తి కాంట్రవర్సిల మధ్య ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచనాలు సృష్టించింది. అతి తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం కేవలం మౌత్ టాక్ తో ఆడియన్స్ లోకి వెళ్లి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాగా ఈ చిత్రాన్ని ‘సుదీప్తో సేన్’ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో సక్సెస్ మీట్ లతో సందడి చేస్తున్నాడు.
Malli Pelli : నరేష్ ‘మళ్ళీ పెళ్లి’ మూవీ మొదటిరోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
ఈ క్రమంలోనే ఒక చోట నుంచి మరో చోటకి తిరుగుతున్న సమయంలో ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. దీంతో ఆయనని చిత్ర యూనిట్ హాస్పిటల్ కి తరలించారు. సమ్మర్ కావడం, విశ్రాంతి లేకుండా తిరుగుతుండడంతో అనారోగ్యానికి గురయ్యారట. ఇక సుదీప్తో సేన్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు అని తెలియడంతో ఆయనకి ఏమైందని అందరూ అరా తీస్తున్నారు. దీంతో ఆయనే స్వయంగా సంపాందించారు. డీహైడ్రేషన్, ఇన్ఫెక్షన్ సమస్యల వలనే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యినట్లు. ఇప్పుడు తాను బాగానే ఉన్నట్లు, డాక్టర్స్ ఈరోజే తనని ఇంటికి పంపించే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చాడు.
Salman Khan : ఇక తన లైఫ్‌లో పెళ్లి చాప్టర్ లేదని చెప్పేసిన సల్మాన్.. వీడియో వైరల్!
కాగా ఈ మూవీ ఇప్పటి వరకు 200 పైగా కలెక్షన్స్ ని అందుకుంది. లేడీ ఓరియంటెడ్ మూవీ ఈ రేంజ్ కలెక్షన్స్ అందుకోవడం ఇదే మొదటిసారి. కేరళలోని (Kerala) అమ్మాయిలను మతం మార్చి టెర్రరిజంలోకి తీసుకెళ్తున్నారు అనే కాంట్రవర్సియల్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీని.. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో నిలిపివేశారు. అక్కడ కూడా ఈ మూవీ ప్రదర్శించి ఉంటే ఇంకెంత కలెక్షన్స్ ని అందుకొని ఉండేదో? అని ఆడియన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.