Adipurush : చంద్రయాన్ సక్సెస్‌తో ఆదిపురుష్ పై విమర్శలు.. ఓం రౌత్‌ని ఆడేసుకుంటున్న నెటిజన్లు..

చంద్రయాన్ కి ఆదిపురుష్ కి సంబంధం ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఈ రెండిటి బడ్జెట్ ని కంపేర్ చేసి పోస్టులు పెడుతున్నారు.

Adipurush and Chandrayaan Budgets comparing Netizens Trolled again Adipurush and Director Om Raut

Adipurush Movie : ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 (Chandrayaan 3) ప్రాజెక్టు విజయవంతమైన సంగతి తెలిసిందే. ఇస్రో(Isro) వదిలిన విక్రమ్ లాండర్ నిన్న సాయంత్రం చంద్రుడి మీద కాలుమోపింది. ఈ విజయంతో ఇండియా ప్రజలంతా గర్వంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఇస్రోకి అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఇప్పుడు చంద్రయాన్ సక్సెస్ తో మళ్ళీ ఆదిపురుష్ సినిమాపై, డైరెక్టర్ పై ట్రోల్స్ మొదలుపెట్టారు పలువురు నెటిజన్లు.

చంద్రయాన్ కి ఆదిపురుష్ కి సంబంధం ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఈ రెండిటి బడ్జెట్ ని కంపేర్ చేసి పోస్టులు పెడుతున్నారు. ఆదిపురుష్ సినిమా బడ్జెట్ మొదట 500 కోట్లు అని ప్రకటించి ఆ తర్వాత 600 కోట్లు అయిందని చిత్రయూనిట్ తెలిపింది. అయితే టీజర్ రావడంతో సినిమాపై ట్రోల్స్ రాగా మళ్ళీ VFX చేయించాలని ఇంకో 100 కోట్లు ఖర్చుపెట్టినట్టు సమాచారం. బాలీవుడ్ టాక్ ప్రకారం ఆదిపురుష్ సినిమా బడ్జెట్ దాదాపు 700 కోట్లు అయింది. ఇక ఆదిపురుష్ సినిమాపై దేశవ్యాప్తంగా విమర్శలు, నెగిటివిటి వచ్చిన సంగతి తెలిసిందే. రామాయణాన్ని తప్పుగా చూపించారని ఓ పక్క హిందువులు, సినిమా ఫ్లాప్ అయినందుకు అభిమానులు డైరెక్టర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇక చిత్రయూనిట్ కూడా సినిమాపై రోజుకొక మాట మాట్లాడటంతో ఆదిపురుష్ వివాదాల్లో నిలిచింది.

అయితే ఇప్పుడు చంద్రయాన్ 3 ప్రాజెక్టు కేవలం 615 కోట్లు కావడం, ఈ ప్రాజెక్టు సక్సెస్ అవ్వడంతో అంతా ఆదిపురుష్ పై, డైరెక్టర్ ఓం రౌత్ పై పడ్డారు. ఈ రెండిటి బడ్జెట్ ని కంపేర్ చేస్తూ 615 కోట్లు ఖర్చుపెట్టి ఇస్రో చంద్రుడి మీదకు వెళ్లి సక్సెస్ అయి దేశం పేరు నిలబెట్టింది. 700 కోట్లు ఖర్చుపెట్టినా ఆదిపురుష్ ప్రేక్షకులని మెప్పించలేకపోయింది అంటూ అభిమానులు, నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పూజా హెగ్డే ప్లేస్‌లో ఆ హీరోయిన్ ఫిక్స్.. మొన్నటిదాకా అబ్బాయి ఇప్పుడు బాబాయ్‌ సరసన..

ఆదిపురుష్ సినిమా సమయంలో డైరెక్టర్ ఓం రౌత్ ని అంతా తీవ్రంగా ట్రోల్ చేశారు, ఇప్పుడు కూడా మరోసారి ఓం రౌత్ ని ట్రోల్ చేస్తున్నారు. దీంతో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చంద్రయాన్ 3తో పాటు ఆదిపురుష్, ఓం రౌత్ కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు