ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆతృతకు తెరపడింది. ప్రభాస్ డైరెక్ట్ బాలీవుడ్ మూవీగా ‘ఆదిపురుష్’ అనే భారీ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. టీ సిరీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అనువాదం చేయనున్నారు. ఈ చిత్రాన్ని త్రీడీలో రూపొదించనుండటం విశేషం. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నపౌరాణిక చిత్రమిది. రామాయణాన్నే ‘ఆదిపురుష్’ అని తెరకెక్కిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ విషయాన్ని పోస్టర్ ద్వారానే యూనిట్ అనౌన్స్ చేసింది. పోస్టర్‌లో రాముడు, రావణాసురుడు, హనుమంతుడు పాత్రలను ఎలివేట్ చేయడం ద్వారా సినిమా జోనర్‌ను రివీల్ చేశారు. సినిమాలో ప్రభాస్ హీరో కాబట్టి రాముడిగా కనిపిస్తారు. మరి రావణాసురుడు, హనుమంతుడు, సీత పాత్రల్లో ఎవరు నటిస్తారనేది మరింత ఆసక్తిగా మారింది. అయితే ప్రకటనలో ఎక్కడా తాము రామాయణంను తెరకెక్కిస్తున్నట్లు యూనిట్ సభ్యులు చెప్పలేదు. 2021లో షూటింగ్ స్టార్ట్ చేసి 2022లో విడుదల చేస్తామని యూనిట్ తెలిపింది.