చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా పరిచయమవుతున్న ‘ఆదిత్య వర్మ’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకువచ్చింది.. తమిళనాట పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది..
సినీ పరిశ్రమలో ప్రస్తుతం రీమేక్స్ అండ్ బయోపిక్స్ హంగామా కొనసాగుతోంది. టాలీవుడ్‌లో చాలా కాలం తరువాత ట్రెండ్ సెట్ చేసిన సినిమాల్లో ‘అర్జున్ రెడ్డి’ ఒకటి. హై బడ్జెట్ అనే కాకుండా సినిమా కథతో పాటు మేకింగ్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుందని ‘అర్జున్ రెడ్డి’ కంటెంట్ నిరూపిస్తోంది. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ కథ బాక్సాఫీస్ రికార్డులను నమోదు చేసింది. బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేయగా నిర్మాతలకు మంచి లాభాలని అందించిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు ఆ కథ జోరు తమిళ్‌లో కూడా కొనసాగుతున్నట్లు అర్ధమవుతోంది. చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా పరిచయమవుతున్న ‘ఆదిత్య వర్మ’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకువచ్చింది. గత కొంత కాలంగా వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఇక సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ అందుకుంటోంది. మంచి ఓపెనింగ్స్ కూడా అందినట్లు కోలీవుడ్ బాక్సాఫీస్ ఎనలిస్ట్‌లు కామెంట్ చేస్తున్నారు.
Read Also : హ్యాపీ బర్త్‌డే చై – Welcome to The World of NC 19
మొత్తానికి విక్రమ్ తన నటనతో ఆకట్టుకున్నట్లు ఆడియెన్స్ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగు ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు సహాయ దర్శకుడిగా వర్క్ చేసిన గిరీశయ ఆదిత్య వర్మకు దర్శకత్వం వహించాడు. ఒరిజినల్ కంటెంట్‌లో ఉన్న ఫీల్ ఏ మాత్రం చెదరకుండా దర్శకుడు సినిమాని తెరకెక్కించడంతో ఆడియెన్స్‌కి సినిమా కరెక్ట్‌గా కనెక్ట్ అవుతోంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు లాభాలని అందిస్తుందో చూడాలి.