Adivi Sesh: డైరెక్టర్ కృష్ణవంశీతో మూవీ.. నా యాక్టింగ్ నచ్చలేదని తీసేశారు.. సగం షూటింగ్ అయ్యాక

చందమామ సినిమా నుంచి తనను తీసేయడంపై ఆసక్తికర కామెంట్స్ చేసిన హీరో అడివి శేష్(Adivi Sesh).

Adivi Sesh interesting comments about his removal from Chandamama movie

  • చందమామ సినిమాలో మొదటి హీరో అడివి శేష్
  • నవదీప్ స్థానంలో ఎంపికైన అడివి శేష్
  • యాక్టింగ్ నచ్చలేదని తీసేశారట డైరెక్టర్

Adivi Sesh: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో అడివి శేష్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. క్షణం, గూఢచారి, మేజర్ వంటి విభిన్నమైన చిత్రాలతో మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం అడివి శేష్ ‘డెకాయిట్’ విడుదల పనుల్లో బిజీగా ఉన్నారు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న శేష్, తన కెరీర్ ఆరంభంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు.

Hrithik Roshan: నోరు మూయండి.. ‘రామాయణ’ ట్రోలింగ్ పై హృతిక్ స్ట్రాంగ్ కౌంటర్!

ముఖ్యంగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ హిట్ ‘చందమామ’ సినిమాకు సంబంధించి ఆయన పంచుకున్న విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ సినిమాలో హీరో నవదీప్ పోషించిన పాత్ర కోసం తొలుత అడివి శేష్‌(Adivi Sesh)నే ఎంపిక చేశారట మేకర్స్. అప్పట్లో ఈ చిత్రానికి ‘మల్లెపువ్వు’ అనే పేరును అనుకున్నారట. షూటింగ్ ప్రారంభమై కొన్ని రోజుల పాటు శేష్ పాల్గొన్నారట. అయితే, ఆయన నటన పట్ల సంతృప్తి చెందని దర్శకుడు, కొన్ని రోజుల షూటింగ్ తర్వాత శేష్‌ను సినిమా నుంచి తొలగించారట.

ఆయన స్థానంలోకి మరో యంగ్ హీరో నవదీప్‌ను తీసుకుని సినిమాను పూర్తి చేశారు. అప్పట్లో ఈ విషయం తనను ఎంతో బాధించిందని కలిగించిందని చెప్పాడు అడివి శేష్. ఆ అవమానమే తర్వాతి కాలంలో తనను తాను నిరూపించుకోవాలనే కసిని పెంచిందని శేష్ వివరించారు. నేడు ఒక స్టార్‌గా, రచయితగా తనకంటూ ఒక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. దీంతో, అడివి శేష్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.