Major : ఏకంగా 14 రాష్ట్రాల్లో ‘మేజర్’ ట్రెండింగ్.. ఇంకా అదరగొడుతున్న అడివి శేష్..
మేజర్ సినిమా రిలీజైన నెల రోజులకి ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో జులై 3 నుంచి స్ట్రీమింగ్ అవుతూ ట్రెండింగ్ లో నిలుస్తోంది. మేజర్ సినిమా కేవలం ఇండియాలోనే కాక వేరే దేశాల్లో కూడా నెట్ ఫ్లిక్స్ టాప్ లో.............
- Saketh U
- Published on- July 17, 2022 / 09:37 AM IST
Major
Adivi Sesh : 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా అడివి శేష్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘మేజర్’. ఈ సినిమాకి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించగా మహేష్ బాబు కూడా ఓ నిర్మాతగా వ్యవహరించారు. గత నెల జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మేజర్ సినిమా మంచి విజయం సాధించింది. దాదాపు 60 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అడివి శేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది మేజర్.
మేజర్ సినిమా రిలీజైన నెల రోజులకి ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో జులై 3 నుంచి స్ట్రీమింగ్ అవుతూ ట్రెండింగ్ లో నిలుస్తోంది. మేజర్ సినిమా కేవలం ఇండియాలోనే కాక వేరే దేశాల్లో కూడా నెట్ ఫ్లిక్స్ టాప్ లో ట్రెండింగ్ లో ఉంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ ఈ విషయాన్ని షేర్ చేయగా మేజర్ చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది. ‘మేజర్’ సినిమా ఒకటి, రెండు కాదు ఏకంగా 14 దేశాల్లో ట్రెండింగ్‌లో టాప్ 10లో నిలిచింది. తెలుగు, హిందీ భాషలతో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఇది అందుబాటులో ఉంది.
Aishwarya Rai : ఐశ్వర్యరాయ్ బ్యూటీ సీక్రెట్ ఇదే అంట..
ఇండియా, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, పాకిస్థాన్, శ్రీలంక, మారిషస్ లో నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ 1 లో కొనసాగుతుండగా బహ్రెయిన్, కువైట్, మలేషియా, ఒమన్, యూఏఈ, ఖతార్, సింగపూర్, నైజీరియా దేశాల్లో టాప్ 10లో కొనసాగుతుంది. దీంతో ఈ సినిమా యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి ఇంత పేరు రావడం చాలా మంచి విషయం అని చిత్ర యూనిట్ అంటున్నారు. అడివిశేష్ ఈ సినిమాలో నటనతో మరింత పేరు సంపాదించాడు.
