Aishwarya Rai : ఐశ్వర్యరాయ్‌ బ్యూటీ సీక్రెట్ ఇదే అంట..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన బ్యూటీ సీక్రెట్ చెప్పింది. ఐశ్వర్య మాట్లాడుతూ.. ''నాకు వంశపారపర్యంగా అందిన వరం మంచి స్కిన్‌. దాన్ని కాపాడుకోవడానికి వంశపారంపర్యంగా అందిన సంపద..............

Aishwarya Rai : ఐశ్వర్యరాయ్‌ బ్యూటీ సీక్రెట్ ఇదే అంట..

Aishwarya

Aishwarya Rai :  ఇప్పటికి అందం ప్రస్తావన వస్తే ఐశ్వర్యరాయ్‌ పేరు కచ్చితంగా విన్పిస్తుంది. ఇప్పటికి పెళ్లై, ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా 48 ఏళ్ల వయసులో కూడా ఐష్‌ అందం ఇంచు కూడా కరగలేదు. రోజురోజుకీ ఆమె అందం పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. అనేక సినిమాల్లో ఆమె అందాన్ని వర్ణిస్తూనే పాటలు రాశారు. ఆమె అందానికి 1994లోనే ప్రపంచ సుందరి కిరీటం ఆమె చేరువైంది. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తూ తన అభిమానులని అలరిస్తుంది.

Rashmika Mandanna : పొట్టి బట్టలతో మరోసారి ఇబ్బంది పడ్డ రష్మిక.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన బ్యూటీ సీక్రెట్ చెప్పింది. ఐశ్వర్య మాట్లాడుతూ.. ”నాకు వంశపారపర్యంగా అందిన వరం మంచి స్కిన్‌. దాన్ని కాపాడుకోవడానికి వంశపారంపర్యంగా అందిన సంపద అద్భుతమైన చిట్కాలు. మా అమ్మ ఏవైతే పాటించిందో నేను అదే పాటిస్తున్నాను. వేయించిన, మసాలా కూరలకు చాలా దూరంగా ఉంటాను. ఆవిరి మీద ఉడికించిన తాజా కూరగాయలను తింటాను. మామూలు రైస్‌ తినకుండా బ్రౌన్‌ రైస్‌ తీసుకుంటాను. మూడు పూటలు కడుపు నిండుగా తినకుండా కొంచెం కొంచెంగా నాలుగైదు పూటలు తింటాను. మంచి నీళ్లు బాగా తాగుతాను. మా అమ్మ ఇవే పాటిస్తుంది. నేనూ చిన్నప్పట్నుంచి ఇవే ఫాలో అవుతున్నాను” అని తెలిపింది.