Adivi Sesh : చిరు చేతులు మీదగా అవార్డుని అందుకున్న అడివి శేషు..
టాలీవుడ్ టాలెంటెడ్ హీరోస్లో అడివి శేషు ఒకడు. గత ఏడాదిలో ఈ హీరో 'మేజర్', 'హిట్-2' సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్టులను అందుకున్నాడు. ఈ ఏడాది సంతోషం పురస్కారాల్లో అడివి శేషు మేజర్ సినిమాకు గాను అవార్డుని అందుకున్నాడు. ఆ అవార్డుని చిరు చేతులు మీదగా అందుకున్నాడు. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ట్విట్టర్ లో..
- gum 95921
- Published on- January 8, 2023 / 07:57 AM IST
Adivi Seshu received the award on the hands of Chiranjeevi
Adivi Sesh : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోస్లో అడివి శేషు ఒకడు. ఆక్టర్గా, రైటర్‌గా సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు. గూఢచారి సినిమాతో మొదలైన తన విజయ పరంపరాని ఇప్పటి వరకు కొనసాగిస్తున్నాడు. గత ఏడాదిలో ఈ హీరో ‘మేజర్’, ‘హిట్-2’ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్టులను అందుకున్నాడు. తాజాగా అడివి శేషు తన అభిమాన హీరో చిరంజీవి చేతులు మీదగా అవార్డుని అందుకున్న విషయాన్ని తెలియజేస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
Goodachari 2 : ప్రీ విజన్ వీడియో సిద్ధం చేస్తున్న అడివి శేషు.. గూఢచారి-2 అప్డేట్!
ముంబై తాజ్ హోటల్ ఉగ్రవాదులను ఎదిరించి పోరాడిన ‘మేజర్ ఉన్ని కృష్ణన్’ బయోపిక్ ని ‘మేజర్’గా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం అడివి శేషు చాలా కష్టపడ్డాడు. నటుడు గానే కాదు రైటర్ గా కూడా ఈ సినిమా విజయంలో ఒక కీలకమైన పాత్ర పోషించాడు. కాగా ప్రతి ఏటా టాలీవుడ్ యాక్టర్స్ కి సంతోషం అవార్డ్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది పురస్కారాల్లో అడివి శేషు మేజర్ సినిమాకు గాను అవార్డుని అందుకున్నాడు.
ఆ అవార్డుని చిరు చేతులు మీదగా అందుకున్నాడు. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ట్విట్టర్ లో.. ‘చిన్నప్పుడు మీ సినిమా టికెట్లు కోసం కొట్టుకునే వాళ్ళం. అలాంటి మీరు ఒక హాఫ్ డే అంతా మా మేజర్ సినిమా గురించి మాట్లాడడం నాకు చాల గర్వంగా ఉంది. ఇక ఇప్పుడు మీ చేతులు మీదగా ఆ సినిమాకి అవార్డుని అందుకోవడం నాకు జీవితాంతం గుర్తుండి పోతుంది’ అంటూ ట్వీట్ చేశాడు. అలాగే అవార్డుని అందుకుంటున్న ఫ్తోటలను కూడా షేర్ చేశాడు.
