Allu Arjun : జైలు నుండి బయటికి వచ్చాక మొదటిసారి మేనమామ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్..

అల్లు అర్జున్ జైలు నుండి బయటికి వచ్చిన నేపథ్యంలో ఆయన ఇప్పుడు తన మేనమామ మెగాస్టార్ చిరంజీవిని కలవడానికి స్వయంగా తన భార్య అల్లు స్నేహ రెడ్డి తో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లారు.

After coming out of jail Allu Arjun visited Megastar Chiranjeevi house for the first time

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య 70 ఎంఎం థియేటర్‌లో దురదృష్టవశాత్తు తొక్కిసలాట జరిగి ఒకరి ప్రాణాలను బలిగొన్న నేపథ్యంలో శుక్రవారం టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్‌ని అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు.

Also Read : Samantha : అల్లు అర్జున్ ని చూసి ఏడ్చేసిన స్నేహ రెడ్డి.. వారిని చూసి ఎమోషనల్ అయిన సమంత..

అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు కాగా నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలైన అప్పటి నుంచి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సినీ ప్రముఖులు అల్లు అర్జున్ నివాసానికి వచ్చారు. ఇక అల్లు అర్జున్ జైలు నుండి బయటికి వచ్చిన నేపథ్యంలో ఆయన ఇప్పుడు తన మేనమామ మెగాస్టార్ చిరంజీవిని కలవడానికి స్వయంగా తన భార్య అల్లు స్నేహ రెడ్డి తో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లారు.


ఇకపోతే అల్లు అర్జున్ కి బెయిల్ రావడానికి స్వయంగా చిరంజీవినే లాయర్ నిరంజన్ రెడ్డిని రంగంలోకి దింపారన్న సంగతి తెలిసిందే.  అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే మెగాస్టార్ హుటా హుటిన ఆయన ఇంటికి చేరుకున్న సంగతి తెలిసిందే. మరి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ ఏ విషయాల గురించి చర్చిస్తారు ఏంటి అన్న విషయాలు తెలియాల్సి ఉంది.