కమ్మరాజ్యంలో కడప రెడ్లు తర్వాత మెగా ఫ్యామిలీ టార్గెట్ చేసిన వర్మ

పబ్లిసిటీకి మారు పేరైన వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ ప్రకటించి రచ్చకు తెరలేపాడు. మరోసారి అదే తరహాలో సినిమా తీస్తానంటూ సోమవారం ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఆ సినిమా టైటిల్‌ను మంగళవారం ఉదయం ప్రకటిస్తానని అది మెగా ఫ్యామిలీ గురించి ఉండబోతుందని పోస్టు చేశాడు. 

పైగా ఈ సినిమా గురించి మంగళవారం ఉదయం 9గంటల 36నిమిషాలకు పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పాడు. కొద్ది రోజుల ముందు వరకూ హడావిడి చేసిన వర్మ దీపావళి పండుగ రోజున ఏపీ రాజకీయాలకు తనదైన శైలిలో సీన్లను జోడించి ట్రైలర్ వదిలాడు. 

‘బ్రేకింగ్ న్యూస్.. మూడుసార్లు ముఖ్యమంత్రి చేసిన బాబు పార్టీ చరిత్రలోనే ఎవ్వరూ రుచి చూడనంత ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత కొన్ని చాలా విపరీత పరిస్థితులు ఏర్పడుతున్నాయ్’ అంటూ వర్మ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందో.. అది విడుదల అయ్యేదాకా తీస్తాడో లేదో కూడా అనుమానమే.