మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ తేజ జోరు మీదున్నాడు. సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారిపోతున్నాడు. నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్నాడు చెర్రీ. ‘రంగస్థలం’తో భారీ సక్సెస్ కొట్టిన చెర్రీ..బోయపాటి కాంబినేషన్‌లో ‘వినయ విదేయ రామ’ సినిమా చేశాడు. తరువాత నెక్ట్స్ సినిమా ఎవరితో ఉంటుందని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూశారు. టాలీవుడ్ జక్కన్న సినిమా RRRలో నటిస్తున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం షూటింగ్ ప్రారంభమైంది. ఇది సెట్ మీద ఉండగానే చెర్రీ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
కేవలం 5 సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించిన ‘వంశీ పైడిపల్లి’తో చెర్రీ జతకట్టబోతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ ‘మహేష్ బాబు’తో ‘మహర్షి’ ఫిల్మ్‌ను వంశీ తెరకెక్కిస్తున్నాడు. సినిమా షూటింగ్ ఎండింగ్‌కు చేరుకుంది. తాజాగా వీరిద్దరీ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందనే టాక్ రావడంతో టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వంశీ పైడిపల్లి చెప్పిన కథ నచ్చడంతో ఒకే చేశారు రామ్ చరణ్. RRR అనంతరం చెర్రీ – వంశీ పైడిపల్లి సినిమా సెట్‌పైకి వెళుతుందని టాక్. ఆర్.ఆర్.ఆర్ సినిమా 2020లో రిలీజ్ కానుంది.