Mirzapur : సూపర్ హిట్ సిరీస్.. ఇప్పుడు సినిమా.. మిర్జాపూర్ వచ్చేస్తుంది..

మిర్జాపూర్: ది మూవీ టీజర్ రేపు జూన్ 25న రిలీజ్ కానుంది. (Mirzapur)

  • Published on- June 24, 2026 / 07:47 PM IST

Mirzapur

Mirzapur : అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చిన బాలీవుడ్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఈ సిరీస్ కి, ఈ సిరీస్ లోని పాత్రలకు తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ సిరీస్ ఆధారంగా సినిమా రాబోతుంది.

మిర్జాపూర్: ది మూవీ టీజర్ రేపు జూన్ 25న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సినిమా నుంచి పలు పోస్టర్స్ రిలీజ్ చేసి మూవీ రిలీజ్ డేట్ ని కూడా కంఫర్మ్ చేసారు. మిర్జాపూర్ ప్రపంచాన్ని నిర్వచించిన గద్దీ, మున్నా భయ్యా, గుడ్డు భయ్యా, కాలీన్ భయ్యా పాత్రల పోస్టర్స్ ని రిలీజ్ చేసారు. గద్దీ హై తో హమ్ హై అంటూ ఈ సినిమాపై హైప్ నెలకొల్పారు.

Also See : Super Subbu Trailer Launch Event : సందీప్ కిషన్ ‘సూపర్ సుబ్బు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. ఫొటోలు..

అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో రితేష్ సిద్ధ్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మాణంలో గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో ఈ మిర్జాపూర్: ది మూవీ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు భాషలో కూడా రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమా 2026 సెప్టెంబర్ 4న థియేటర్లలో రిలీజ్ కానుంది. మరి సిరీస్ హిట్ అయినా రేంజ్ లో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా చూడాలి.