Agent Movie: ప్రీరిలీజ్ ఈవెంట్‌కు డేట్ అండ్ ప్లేస్ ఫిక్స్ చేసిన ఏజెంట్!

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘ఏజెంట్’ వేసవి కానుకగా ఏప్రిల్ 28న రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Agent Movie Pre-Release Event Date And Venue Fixed

Agent Movie: అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ కోసం అభిమానులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను స్టైలిష్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. పూర్తి స్పై థ్రిల్లర్ మూవీగా వస్తున్న ఏజెంట్‌తో అఖిల్ ఖచ్చితంగా భారీ విజయాన్ని అందుకుంటాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Agent Movie Promotions : కాకినాడ పోర్టులో సముద్ర తీరాన ఏజెంట్ స్పెషల్ ఇంటర్వ్యూ..

ఇక ఈ సినిమాను ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈమేరకు ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఏప్రిల్ 23న నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. వరంగల్‌లోని రంగలీల మైదానంలో ఏప్రిల్ 23న సాయంత్రం 5 గంటల నుండి ఈ ఈవెంట్ జరగనుందని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ ఈవెంట్‌కు ఏజెంట్ మూవీ టీమ్‌తో పాటు పలువురు స్టార్ సెలబ్రిటీలు సైతం హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

Agent Movie: ఏజెంట్ మూవీ రన్‌టైమ్ లాక్ చేసిన సురేందర్ రెడ్డి.. ఎంతో తెలుసా?

ఏజెంట్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వస్తాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. దీంతో అందరి చూపు ఇప్పుడు ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌పై పడింది. ఒకవేళ నిజంగానే ప్రభాస్ ఈ ఈవెంట్‌కు వస్తే, ఏజెంట్ మూవీపై అంచనాలు మరింతగా పెరిగిపోతాయి. ఈ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, అందాల భామ సాక్షి వైద్య ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. హిప్‌హాప్ తమిళ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది.