యాంగ్రీ స్టార్ డా.రాజశేఖర్, వీరభద్రమ్ చౌదరి కలయికలో తెరకెక్కబోయే మల్టీస్టారర్ చిత్రం త్వరలో ప్రారంభం..
‘గరుడవేగ’, ‘కల్కి’ చిత్రాలతో వరుస విజయాలు ఖాతాలో వేసుకున్న అగ్రెసివ్ హీరో రాజశేఖర్.. ఇప్పుడు కథల ఎంపికలో వైవిధ్యత ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్లు యువ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఆ కోవలోనే ఆయనొక కొత్త మల్టీస్టారర్‌కు శ్రీకారం చుట్టబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ యాంగ్రీ స్టార్‌తో ప్రముఖ దర్శకుడు వీరభద్రమ్ చౌదరి ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై ఆ మధ్య రకరకాల వార్తలు బయటకొచ్చాయి. కానీ, ఇప్పుడు తెలిసిన ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇదొక మల్టీస్టారర్ కథాంశంతో రూపొందబోతుందట. రాజశేఖర్ పాత్రతో పాటు మరో యువ హీరోకు ఈ కథలో ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
ఇప్పుడీ పాత్ర కోసం శ్రీవిష్ణు, కార్తికేయ లాంటి యువ కథానాయకుల పేర్లను పరిశీలిస్తోంది చిత్ర బృందం. ప్రస్తుతం వీళ్లిద్దరితో చర్చలు జరుపుతున్నారని సమాచారం. మరి ఈ ఇద్దరిలో ఏ హీరో స్క్రిప్ట్‌కు ఓకే చెప్పినా వెంటనే ఈ క్రేజీ మల్టీస్టారర్ పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి..