Aha Web Series Ardhamaindha Arun Kumar Season 2 Trailer Released
Ardhamaindha Arun Kumar Season 2 Trailer : ఆహా ఓటీటీలో గత సంవత్సరం వచ్చిన అర్థమైందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ మంచి విజయం సాధించింది. దానికి సీక్వెల్ గా ఇప్పుడు సీజన్ 2 రానుంది. అర్రే స్టూడియో, లాఫింగ్ కౌ ప్రొడక్షన్స్ బ్యానర్లో అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 ఆహా ఓటీటీలో అక్టోబర్ 31 నుంచి రానుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు.
Also Read : Prabhas Movies : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. ప్రభాస్ నెక్స్ట్ సినిమాలు.. భారీ లైనప్..
ఈ ట్రైలర్ చూస్తుంటే.. మొదటి సీజన్ కంటిన్యూగా సాగింది. అరుణ్ కుమార్ హైదరాబాద్ వచ్చి ఓ సాఫ్ట్ వేర్ జాబ్ లో జాయిన్ అయి పడ్డ కష్టాల తర్వాత మేనేజర్ గా ఎదిగాక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాడు. మళ్ళీ తన లైఫ్ లోకి ముగ్గురు అమ్మాయిలు ఎలా వచ్చారు? వాళ్ళతో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అని కామెడీతో ఎమోషనల్ గా తెరకెక్కించినట్టు తెలుస్తుంది.
ఇక రెండో సీజన్ లో అరుణ్ కుమార్ పాత్రలో సిద్ధూ పవన్ నటిస్తుండగా తేజస్వి మడివాడ, అనన్య, సిరి రాశి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి..