Aishwarya interesting comments about Rajinikanth biopic.
Rajinikanth Biopic: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా జర్నీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒక బస్సు కండక్టర్ గా మొదలైన ఆయన జీవితం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకునే స్థాయికి ఎదిగింది. ఈ ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులు, కష్టాలు చాలానే ఉన్నాయి. వాటన్నిటినీ దాటుకొని ఇక్కడివరకు చేరిన ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తి దాయకం అనే చెప్పాలి.
అందుకే, ఆయన జీవితాన్ని సినిమాగా చేయాలనీ ఆలోచన కాలం నుంచి ఉంది. అయితే, ఆ సినిమా ఎవరు చేస్తారు? అందులో రజనీకాంత్ పాత్ర ఎవరు చేస్తారు అనే అంశం చాలా పెద్ద ప్రశ్నగా మారింది. అందుకే, ఎవరు రజనీకాంత్ బయోపిక్(Rajinikanth Biopic) ను మొదలుపెట్టలేదు అనుకున్నారు. కానీ, రజనీకాంత్ బయోపిక్ గురించి అయన కుమార్తె ఐశ్వర్య ఇటీవల ఆసక్తికర కామెంట్స్ చేసింది. అదేంటంటే, రజనీకాంత్ బయోపిక్ ఇప్పటికే మొదలయ్యిందట.
Jyotipoorvaj: సీరియల్ బ్యూటీ జ్యోతిపూర్వజ్.. హాట్ అందాలు కెవ్వు కేక.. ఫొటోలు
అవును, ఇటీవల ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆమె రజనీకాంత్ బయోపిక్ గురించి మాట్లాడుతూ.. “నా తండ్రి, రజనీకాంత్ జీవిత కథా ఆధారంగా వస్తున్న సినిమా ఇప్పటికే మొదలయ్యింది. ఆ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. విడుదల అయ్యాక ప్రపంచవ్యాప్తంగా అదొక సంచలనంగా మారుతుంది” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో, ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తమ అభిమాన హీరో జీవితకథ ఆధారంగా సినిమా వస్తుండటంతో రజనీకాంత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం రజనీకాంత్ దర్శకుడు నెల్సన్ తో జైలర్ 2 సినిమా చేస్తున్నాడు. బ్లాక్ బస్టర్ జైలర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తరువాత దర్శకుడు సీబీ చక్రవర్తితో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రజనీకాంత్. ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తున్నాడు. ఇటీవలే లాంఛనంగా మొదలైన ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.