కొత్త ఐశ్వర్య వచ్చింది.. అచ్చం ఐశ్వర్య రాయ్ బచ్చన్‌లానే ఉందిగా.. కార్బన్ కాపీ..! ఫొటోలు వైరల్

Aishwarya Rai Bachchan’s Carbon Copy : మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటారు. అది నిజమే.. అలాంటి వాళ్లు ఎక్కడో ఒకచోట తారసపడుతునే ఉంటుంటారు. సెలబ్రెటీల్లో అయితే ఎక్కువమంది ఒకరిని పోలి ఒకరు కనిపిస్తుంటారు.


ఇప్పుడు అలాంటి సెలబ్రిటీని పోలిన ఓ పాకిస్తాన్ అమ్మాయి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ను పోలి ఉంది ఆ అమ్మాయి.. అచ్చం మన ఐశ్వర్య లానే కనిపిస్తోంది.


ఆమె పేరు.. ఆమ్నా ఇమ్రాన్.. మెడికల్ ప్రొఫెషనల్ అయిన ఈ అమ్మాయి అమెరికాలో వర్క్ చేస్తోంది. ఇప్పుడు ఆమ్నా ఇన్ స్టా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఆమ్నా ఫొటోలు చూసిన నెటిజన్లంతా కొత్త ఐశ్వర్య వచ్చింది.. మన ఐశ్వర్య రాయ్ బచ్చన్ కు జిరాక్స్.. కార్బన్ కాపీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆమెను డూప్లికేట్‌ ఐశ్వర్య అంటున్నారు.


బూడిదరంగులో పెద్ద కళ్లు, గులాబీ రేకుల్లాంటి పెదాలతో వైట్‌ షర్ట్‌ వేసుకుని ఉంది.. అచ్చం ఐశ్వర్య రాయ్‌ చూసినట్లుగానే ఉంది.. ఐశ్వర్య నటించిన సినిమాల్లోని కొన్ని సీన్లలో హావభావాలతో ఆమ్నా వీడియోలు కూడా పోస్టు చేసింది.


ఆ వీడియోలు చూసిన నెటిజన్లంతా ఐశ్వర్య డూప్‌ అంటూ వైరల్‌ చేస్తున్నారు. ఆమ్నా ఇన్‌స్టాగ్రామ్‌లో 30 వేలమంది ఫాలోవర్స్‌ ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు