‘వరల్డ్ ఫేమస్ లవర్’ – విజ‌య్ భార్యగా ఐశ్వ‌ర్యా రాజేష్‌

'వరల్డ్ ఫేమస్ లవర్' - విజయ్ దేవరకొండ భార్య సువ‌ర్ణ‌ పాత్ర‌లో ఐశ్వ‌ర్యా రాజేష్ న‌టిస్తున్నారు.. జనవరి 3న టీజర్ విడుదల..

  • Publish Date - December 13, 2019 / 06:59 AM IST

‘వరల్డ్ ఫేమస్ లవర్’ – విజయ్ దేవరకొండ భార్య సువ‌ర్ణ‌ పాత్ర‌లో ఐశ్వ‌ర్యా రాజేష్ న‌టిస్తున్నారు.. జనవరి 3న టీజర్ విడుదల..

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, ‘ఓనమాలు’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమాలతో ఆకట్టుకున్న క్రాంతి మాధవ్‌ల కాంబినేషన్లో, సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కయర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ (World Famous Lover)..

రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఎజిబెల్లా, క్యాథరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. వేలంటైన్స్ డే సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 14న సిినిమాను విడుద‌ల చేయనున్నారు. ‘వ‌ర‌ల్డ్ ఫేమస్ ల‌వ‌ర్‌’ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ పాత్ర పేరు శీన‌య్య‌. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ భార్య సువ‌ర్ణ‌ పాత్ర‌లో ఐశ్వ‌ర్యా రాజేష్ న‌టిస్తున్నారు.

వీరిద్ద‌రూ కిచెన్‌లో ఉన్న రొమాంటిక్ లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ యంగ్ లుక్‌లో క‌న‌ప‌డుతుంటే.. ఐశ్వ‌ర్యా రాజేష్ హోమ్లీ లుక్‌లో క‌న‌ప‌డుతున్నారు. అలాగే ఈ నెల 13న ఇజా బెల్లా, 14న క్యాథరిన్ త్రెసా, 15న రాశీఖ‌న్నాల‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్‌ను విడుద‌ల చేయ‌బోతున్నారు. సినిమా టీజ‌ర్‌ను జ‌న‌వ‌రి 3న విడుద‌ల చేస్తున్నారు. కెమెరా : జయకృష్ణ గుమ్మడి, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం : గోపి సుందర్, ఆర్ట్ : సాహి సురేష్.