Aishwaryaa R Dhanush : తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న ధనుష్ భార్య..
సూపర్ స్టార్ రజినీ కాంత్ కుమార్తె, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ భార్య ఐశ్వర్య ధనుష్ టాలీవుడ్ ఎంట్రీ..
- sekhar
- Published on- October 2, 2021 / 07:20 PM IST
Aishwaryaa Dhanush
Aishwaryaa R Dhanush: కోలీవుడ్ సినీ ప్రముఖులు టాలీవుడ్ ఎంట్రీకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్, రామ్ చరణ్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాతో స్టార్ హీరో ధనుష్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఇప్పుడు ఆయన బాటలోనే భార్య ఐశ్వర్య ధనుష్ కూడా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు.
Naga Chaitanya – Samantha : కన్ఫామ్.. విడిపోయిన నాగ చైతన్య – సమంత
సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మాతలు సుభాస్కరన్, మహవీర్ జైన్ స్ట్రయిట్ తెలుగు సినిమా నిర్మించనున్నారు. ధనుష్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘3’తో ఐశ్వర్య దర్శకురాలిగా పరిచయమయ్యారు. తెలుగులో కూడా ఆ సినిమా విడుదలైంది. ఆ తర్వాత ‘వెయ్ రాజా వెయ్’ అనే తమిళ సినిమా కూడా డైరెక్ట్ చేశారు.
ChaySam : విడిపోతూ కూడా ఒకేమాట..
ఇప్పుడు దర్శకురాలిగా మూడో సినిమా, తెలుగులో చేయడానికి ఐశ్వర్య ఆర్. ధనుష్ సిద్ధమవుతున్నారు. పాన్ ఇండియన్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.
ChaySamBreakUP: బరువెక్కిన గుండెతో.. చైతన్య, సమంత బ్రేకప్‌పై నాగార్జున రియాక్షన్!
ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ.. ‘‘లైకా ప్రొడక్షన్స్‌లో ఈ సినిమాకి దర్శకత్వం వహించడానికి ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నాను. పాన్ ఇండియన్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది’’ అని చెప్పారు.
