అజిత్ లేడీ ఫ్యాన్స్ అయితే మేమేం తక్కువ కాదన్నట్టు, స్ర్కీన్‌పైకెక్కి మరీ డ్యాన్స్ చేసారు.
తళ అజిత్ నటించిన విశ్వాసం సినిమా, సంక్రాంతి కానుకగా ఈరోజు (జనవరి10) తమిళనాట భారీస్థాయిలో రిలీజ్ అయ్యింది. అజిత్ ఈ సినిమాలో డబుల్ రోల్ చేసాడు. నయనతార హీరోయిన్‌గా చేసింది. వీరం, వేదాళం, వివేకం తర్వాత అజిత్, శివల కాంబినేషన్‌లో నాలుగవ సినిమాగా వస్తున్న విశ్వాసంపై భారీ అంచనాలున్నాయి. తమిళనాట
ఈ ఉదయం 5గంటల నుండే బెన్‌ఫిట్ షోలు పడ్డాయి. అజిత్ ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర ఒక రేంజ్‌లో సందడి చేసారు.
ఇక, అజిత్ లేడీ ఫ్యాన్స్ అయితే మేమేం తక్కువ కాదన్నట్టు, స్ర్కీన్‌పైకెక్కి మరీ డ్యాన్స్ చేసారు. అజిత్ ఇంట్రడక్షన్ సాంగ్‌కి అమ్మాయిలంతా డ్యాన్స్ చేస్తుండగా, సినిమా చూస్తున్నవారు, వాళ్ళని ఫోటోలు తీస్తూ, ఈలలు వేస్తూ, గోల గోల చేసారు. అజిత్ విశ్వాసం థియేటర్లో, లేడీ ఫ్యాన్స్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
#Viswasam Ladies SPL @velacinemas wow what a response from Ladies? @directorsiva @SathyaJothiFlim @kjr_studios @saisiddharth_ @RamCinemas @RohiniSilverScr @VettriTheatres @GKcinemas pic.twitter.com/hGt5ig074r
— velacinema (@velacinemas) January 10, 2019