Dhurandhar: తెలుగులోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘దురంధర్’.. రిలీజ్ ఎప్పుడంటే?

బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ 'దురంధర్(Dhurandhar)' బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మొదటిరోజు నుంచే ఆడియన్స్ నుంచి పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా పది రోజులో ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.

Dhurandhar: తెలుగులోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘దురంధర్’.. రిలీజ్ ఎప్పుడంటే?

Blockbuster Dhurandhar movie Telugu version releasing soon.

Updated On : December 14, 2025 / 8:28 PM IST

Dhurandhar; బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ దురంధర్’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మొదటిరోజు నుంచే ఆడియన్స్ నుంచి పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా పది రోజులో ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. అయితే, సినిమాకు వస్తున్న ఆదరణతో ఈ కలెక్షన్స్ రోజురోజుకి పెరుగుతున్నాయి. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. URI మూవీ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా నటించాడు.

Thaman: టాలీవుడ్ ఇండస్ట్రీకి దిష్టి తగిలింది.. అఖండ 2 ఈవెంట్ లో తమన్ ఆవేదన

అయితే, తాజాగా దురంధర్(Dhurandhar) సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే, దురంధర్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమా చూడాలని అనుకుంటున్నారు. దురంధర్ సినిమా పాన్ ఇండియా అప్పీల్ ఉన్న సబ్జెక్టు అయినప్పటికీ తెలుగులో మాత్రం విడుదల చేయలేదు మేకర్స్. కానీ, ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారట. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే తెలుగు విడుదలపై అధికారిక ప్రకటన చేయనున్నారట మేకర్స్.

ఇక ఈ న్యూస్ తెలిసి తెలుగు ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక దురంధర్ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాపై స్టార్ సెలబ్రెటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాను చూశాడు. చూసి తన ట్విట్టర్ లో సినిమాపై, దర్శకుడు, హీరో పై ప్రశంసలు కురిపించాడు. తనకు సినిమా బాగా నచ్చిందని, తనప్పకుండా ఈ సినిమాను అందరు చూడాలని సూచించాడు. మరి తెలుగులో రిలీజ్ అయ్యాక ఈ సినిమాకు ఎక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.