Thaman: టాలీవుడ్ ఇండస్ట్రీకి దిష్టి తగిలింది.. అఖండ 2 ఈవెంట్ లో తమన్ ఆవేదన

తమన్(Thaman) ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. తెలుగు సినిమా ఇండీస్ట్రీకి దిష్టి తగిలింది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

Thaman: టాలీవుడ్ ఇండస్ట్రీకి దిష్టి తగిలింది.. అఖండ 2 ఈవెంట్ లో తమన్ ఆవేదన

Thaman emotional comments about the Tollywood industry.

Updated On : December 14, 2025 / 8:07 PM IST

నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అఖండ 2. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా రీసెంట్ గా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాపై ముందు నుంచే భారీ అంచనాలు కక్రియేట్ అయ్యాయి. అందుకే, మొదటిరోజు ఏకంగా రూ.59 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది ఈ సినిమా. ఈనేపథ్యంలోనే తాజాగా అఖండ 2 సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్బంగా ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అందించిన తమన్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. తెలుగు సినిమా ఇండీస్ట్రీకి దిష్టి తగిలింది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

Bandla Ganesh: ఇవన్నీ పోస్టర్ మాటలే.. సినిమా వేరే ఉంటదనుకున్నా.. మోగ్లీ మూవీపై బండ్ల గణేష్ షాకింగ్ రివ్యూ

ఈ సందర్బంగా తమన్ మాట్లాడుతూ..”ఆ పరమశివుడి శక్తితోనే ఈ సినిమా కోసం ఎనర్జీగా పనిచేశాం. నా మ్యూజిక్‌ వెనుక ఎంతో మంది సింగర్స్, లిరిసిస్ట్స్, ప్లేయర్స్ కష్టం ఉంది. వారందరికీ కృతజ్ఞతలు. సాధారణంగా హీరో, హీరోయిన్‌ మధ్య కెమిస్ట్రీ ఉంటుంది. కానీ, కొత్తగా బాలకృష్ణ, బోయపాటి కెమిస్ట్రీ సెట్ అయ్యింది. కానీ, అది ఫిజిక్స్‌ రూపంలో బయటకు వస్తుంది. అఖండ 2 సినిమా వారం ఆలస్యంగా రిలీజ్ అయ్యింది. ఆపాలని అనుకుంటే ముందే ఆపొచ్చు కానీ, చివరి నిమిషంలో ఆపారు. నిజానికి, మన మధ్య ఐక్యత లేకుండా పోయింది. అంతా ‘మనం’ అనుకున్నప్పుడు కలిసి ముందుకు వెళ్తాం. ఇండస్ట్రీలో ఐక్యత లోపించింది. మన తెలుగు చిత్ర పరిశ్రమకు బయట ఎంతో పేరుంది. ఇంత మంది స్టార్స్, ఈ రేంజ్ ఫ్యాన్స్ ప్రపంచంలో ఎక్కడా లేరు. అందుకే, మన తెలుగు ఇండస్ట్రీకి దిష్టి తగిలిందేమో అనిపిస్తుంది. యూట్యూబ్‌, సోషల్‌ మీడియాలో నెగెటివిటీ పెరిగిపోయింది.

ఎవరికైనా దెబ్బ తగిలినప్పుడు బ్యాండెడ్‌ వేయడానికి ట్రై చేయండి.. బ్యాండ్‌ వేయడానికి కాదు. సినిమా వాయిదా పడటం వల్ల ఆ నిర్మాతలు ఎంత కుమిలిపోయి ఉంటారు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది కదా. కానీ, మేము మాత్రం సినిమా ఎప్పుడొచ్చినా హిట్ అవుతుందని నమ్మాము” అంటూ తన ఆవేదనను చెప్పుకొచ్చాడు తమన్. దీంతో తమన్ చేసిన ఈ ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి.