Bandla Ganesh: ఇవన్నీ పోస్టర్ మాటలే.. సినిమా వేరే ఉంటదనుకున్నా.. మోగ్లీ మూవీపై బండ్ల గణేష్ షాకింగ్ రివ్యూ
రీసెంట్ గా 'మోగ్లీ 2025' సినిమా చూసిన బండ్ల గణేష్(Bandla Ganesh) తన ఒపీనియన్ ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
Bandla Ganesh shocking review on Mowgli 2025 movie.
Bandla Ganesh; నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చాలా కాలం నటుడిగా అలరించిన బండ్ల గణేష్(Bandla Ganesh) గబ్బర్ సింగ్ సినిమాతో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు. ఆ తరువాత నిర్మాతగా వరుస సినిమాలు చేశాడు. కానీ, ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. కేవలం సినిమాలే కాదు. ఆయన ఎం చేసినా సంచలనమే. పవన్ కళ్యాణ్ ను అమితంగా ప్రేమించే బండ్ల గణేష్ ఆయన గురించి స్టేజిలపై ఇచ్చే స్పీచ్ లకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అవి సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి.
Anil Ravipudi: లుక్ విషయంలో చిరంజీవి సజేషన్.. నో చెప్పిన అనిల్.. అంతా ఆయన అనుకున్నట్టుగానే..
తాజాగా, ఈ నటుడు లేటెస్ట్ మూవీపై షాకింగ్ రివ్యూ ఇచ్చాడు. అది కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు యాంకర్ సుమ కనకాల కొడుకు హీరోగా వచ్చిన “మోగ్లీ 2025”. డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్సుడ్ టాక్ వచ్చింది. రీసెంట్ గా ఈ సినిమాను చూసిన బండ్ల గణేష్ ‘మోగ్లీ 2025’ సినిమాపై తన ఒపీనియన్ ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
“పోస్టర్ పై ‘వైల్డ్ బ్లాక్‌బస్టర్’ ట్యాగ్ చూసి.. ఇవన్నీ పోస్టర్ మాటలే సినిమా వేరేలా ఉంటుందని అనుకున్నాను. కానీ, సినిమా చూసాక అర్థమైంది పోస్టర్ సాఫ్ట్ గా ఉందని.రోషన్ మా సుమ-రాజీవ్ ల కొడుకే కదా అనుకున్నా. కానీ, స్క్రీన్ మీద చూసాక అనిపించింది రోషన్ కనకాల అనే కొత్త నటుడు పుట్టాడని. డైరెక్టర్ సందీప్ రాజ్ రైటింగ్, సీన్స్ లో క్లారిటీ, మాటల్లో సింప్లిసిటీ నాకు బాగా నచ్చింది. బండి సరోజ్ కుమార్ విలనిజం, విలన్ పాత్ర కదా అని ఎక్కువ చేయలేదు. చేసిందే ఎక్కువయ్యింది. సాక్షి అమాయకత్వం కూడా సినిమాను బ్యాలెన్స్ చేసింది. కాల భైరవ సంగీతం అవసరమైన చోటే పని చేసింది. విశ్వప్రసాద్ గారి సినిమా టేస్ట్ మళ్లీ గుర్తు చేశారు. మోగ్లీ సినిమా తరువాత “వైల్డ్” అనే పదం అప్‌డేట్ అయింది. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ఇంకా రావాలి. మనం థియేటర్స్ నుంచి హాయిగా, నవ్వుతూ బయటకి రావాలి” అంటూ రాసుకొచ్చాడు. దీంతో బండ్ల గణేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
