Anil Ravipudi: లుక్ విషయంలో చిరంజీవి సజేషన్.. నో చెప్పిన అనిల్.. అంతా ఆయన అనుకున్నట్టుగానే..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న కొత్త సినిమా మన శంకర వరప్రసాద్ గారు. కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
Director Anil Ravipudi made interesting comments about Chiranjeevi looks.
Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న కొత్త సినిమా మన శంకర వరప్రసాద్ గారు. కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ బ్లాక్ బస్టర్ తరువాత అనిల్ నుంచి వస్తున్న సినిమా కావడం, అందులోను మెగాస్టార్ చిరు హీరోగా చేస్తుండటంతో మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఇక చిరంజీవి కూడా వింటేజ్ లుక్ లో కనిపిస్తుండటంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
Sahana Sahana Song Promo: రాజా సాబ్ నుంచి బ్యూటిఫుల్ మెలోడీ.. “సహానా.. సహానా” ప్రోమో వచ్చేసింది..
ఇక ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్టుగా ప్రాకటించారు మేకర్స్. ఇందుకోసం ప్రత్యేకమైన ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో మన శంకర వరప్రసాద్ గారు సినిమా గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. ఈ సందర్బంగా దర్శకుడు అనిల్ ఈ సినిమాలో చిరంజీవి లుక్ గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు.”ఈ సినిమా కోసం చిరంజీవి గారు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ట్రై చేద్దాం అన్నారు. నేను దానికి నో చెప్పాను. ఆయన బయట ఎలా ఉన్నారో సినిమాలోనూ అలానే చూపించడానికి ట్రై చేశాను. ఆయనకీ కూడా అదే చెప్పాను. 25 ఏళ్ల క్రితం ఎంత స్లిమ్‌గా, అందంగా ఉన్నారో ఇప్పుడూ ఆయన అలానే ఉన్నారు” అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక మన శంకర వరప్రసాద్ గారు సినిమా విషయానికి వస్తే, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదల చేశారు మేకర్స్. భీమ్స్ సంగీతం అందించిన ఈ రెండు పాటలు ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇక త్వరలోనే చిరంజీవి-వెంకటేష్ మధ్య తెరకెక్కించిన సాంగ్ ని విడుదల చేయనున్నారట మేకర్స్. ఈ సాంగ్ గురించి కూడా త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరి ఇద్దరు సీనియర్ హీరోలు కలిసి చేసిన ఆ సాంగ్ ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
