Akhanda : సెన్సార్ టాక్.. ‘సింహ’ గర్జన సాలిడ్‌గా ఉంటుందంట..
బాలయ్య ‘అఖండ’ మూవీ చూసి సెన్సార్ టీం ఏం చెప్పారు?..
- sekhar
- Published On : November 20, 2021 / 07:49 PM IST
Akhanda Censor
Akhanda: ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ – ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ప్రెస్టీజియస్ అండ్ మోస్ట్ అవైటెడ్ హ్యాట్రిక్ ఫిలిం ‘అఖండ’. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Akhanda Trailer Roar : ఇదీ బాలయ్య మాస్ ర్యాంపేజ్!
Akhanda Trailer Roar పేరుతో ట్రైలర్ రిలీజ్ చెయ్యగా బ్రహ్మాండమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. నటసింహా నందమూరి బాలకృష్ణ సరైన మాస్ క్యారెక్టర్, పవర్‌ఫుల్ డైలాగ్స్ చెబితే ఫ్యాన్స్ అండ్ మాస్ ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చెప్పడానికి ‘అఖండ’ ట్రైలర్ రోర్ చిన్న ఎగ్జాంపుల్‌గా నిలిచింది.
Akhanda Pre Release Event : ‘అఖండ’ ఫంక్షన్‌కి అతిథిగా నాని..
డిసెంబర్ 2న థియేటర్లలో ‘అఖండ’ గా బాలయ్య గర్జన మొదలవబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడప్ చేసేశారు. రీసెంట్‌గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా చూసిన సెన్సార్ టీమ్ U/A సర్టిఫికెట్ ఇచ్చారు. 2 గంటల 47 నిమిషాల పాటు ‘అఖండ’ ఫ్యాన్స్, మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరిస్తుందని, ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలను మించి ‘అఖండ’ కచ్చితంగా ‘అఖండ’ ఆదరణ పొందుతుందని సెన్సార్ టీమ్ టాక్.
