Akhanda Pre Release Event : ‘అఖండ’ ఫంక్షన్‌కి అతిథిగా నాని..

నవంబర్ 27న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో గ్రాండ్‌గా ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్..

Akhanda Pre Release Event : ‘అఖండ’ ఫంక్షన్‌కి అతిథిగా నాని..

Nani

Updated On : November 20, 2021 / 4:31 PM IST

Akhanda Pre Release Event: నటసింహా నందమూరి బాలకృష్ణ సరైన మాస్ క్యారెక్టర్, పవర్‌ఫుల్ డైలాగ్స్ చెబితే ఫ్యాన్స్ అండ్ మాస్ ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చెప్పడానికి ‘అఖండ’ ట్రైలర్ రోర్ చిన్న ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు.

Akhanda Trailer Roar : ఇదీ బాలయ్య మాస్ ర్యాంపేజ్!

‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ప్రెస్టీజియస్ అండ్ మోస్ట్ అవైటెడ్ హ్యాట్రిక్ ఫిలిం ‘అఖండ’. ఈ మూవీ ట్రైలర్ మిలయన్ల కొద్దీ వ్యూస్, మంచి లైక్స్‌తో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

Nitin Mehta : ‘అఖండ’ ట్రైలర్‌లో ఉన్న నితిన్ ఎవరో తెలుసా!

నవంబర్ 27న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో గ్రాండ్‌గా ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రాబోతున్నారని చెప్పారు. కట్ చేస్తే ఆయన ఫ్యామిలీతో స్విట్జర్లాండ్ వెళ్లడంతో రాలేకపోతున్నారని సమాచారం.

Jr NTR Family : ఫ్యామిలీతో స్విట్జర్లాండ్‌కి తారక్

ఇప్పుడు ఈ ఫంక్షన్‌కి గెస్ట్‌గా నేచురల్ స్టార్ నాని వస్తున్నారు. ఇటీవలే బాలయ్య బాబు హోస్ట్ చేస్తున్న Unstoppable షో లో పార్టిసిపెట్ చేసిన సంగతి తెలిసిందే. స్వతాహా నాని, బాలయ్య అభిమాని.. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాలో బాలయ్య డైహార్డ్ ఫ్యాన్‌గా యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. బాలకృష్ణతో మంచి అనుబంధం ఉంది నానికి. ఇక ఇప్పుడు బాలయ్య ‘అఖండ’ ఫంక్షన్‌కి నాని అతిథిగా రాబోతుండడంతో నాని అండ్ బాలయ్య ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

Balayya – Mahesh : బాలయ్య – మహేష్ మల్టీస్టారర్..