×
Ad

Akhanda : ‘అఖండ’ అప్‌డేట్

ప్రేక్షకాభిమానులకు దీపావళి ట్రీట్ రెడీ చేస్తున్నారు బాలయ్య..

  • Published On : November 2, 2021 / 05:48 PM IST

Akhanda Movie

Akhanda: ‘సింహా’, ‘లెజెండ్’ వంటి భారీ సూపర్‌హిట్ సినిమాల త‌ర్వాత‌ నటసింహా నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల మాసివ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Unstoppable with NBK : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బాలయ్య..

ప్రగ్యా జైస్వాల్, పూర్ణ కథానాయికలు. శ్రీకాంత్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన రెండు వీడియోలకు, ఫస్ట్ లిరికల్ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీపావళి కానుకగా మరో అప్‌డేట్ రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. నవంబర్ 4 ఉదయం 11:43 గంటలకు ‘అఖండ’ టైటిల్ సాంగ్ టీజర్ రోర్ పేరుతో వీడియో విడుదల చెయ్యనున్నారు. 8వ తేదీ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ కానుంది.

Unstoppable with NBK : ‘అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవడాపుతాడో చూద్దాం’

బాలయ్య – బోయపాటి కాంబినేషన్ అనగానే ఎలాంటి అంచనాలుంటాయో వాటిని అందుకునే విధంగా సినిమా ఉంటుందని, వీళ్ల కలయికలో ‘అఖండ’ హ్యాట్రిక్ సినిమా చిత్రమవుతుందని మేకర్స్ చెప్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతమందిస్తున్నారు.