Lenin Collections : బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న లెనిన్.. మూడు రోజుల్లో భారీ క‌లెక్ష‌న్లు.. వంద కోట్ల‌కు ఇంకెంత దూరం అంటే?

అక్కినేని అఖిల్ న‌టించిన లెనిన్ చిత్రం బాక్సాఫీస్ (Lenin Collections) వ‌ద్ద దూసుకుపోతుంది.

Akhil Akkineni Lenin 3 Days collections is 61 plus crores

Lenin Collections : అఖిల్ అక్కినేని న‌టించిన తాజా చిత్రం లెనిన్‌. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. మురళీ కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ జూలై 10న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. విడుద‌లైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం 61.1 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం వెల్ల‌డించింది. ఓ స‌రికొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

భాగ్య‌శ్రీ బోర్సే క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రం తొలి రోజు 16.7 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. అఖిల్, భాగ‌శ్రీ బోర్సే న‌ట‌న పై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోండ‌గా.. మ‌రో మూడు నుంచి నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం వంద కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెడుతుంద‌ని సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు.

Chiranjeevi : లెనిన్ పై మెగాస్టార్ చిరంజీవి ప్ర‌శంస‌లు.. సినిమాను చూడ‌లేదు కానీ.. నాగార్జున ఏమ‌న్నారంటే?

అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీలు ఈ మూవీని నిర్మించారు.