Chiranjeevi : లెనిన్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. సినిమాను చూడలేదు కానీ.. నాగార్జున ఏమన్నారంటే?
లెనిన్ పై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) ప్రశంసలు కురిపించారు.
Chiranjeevi praises Akhil lenin movie Nagarjuna replay viral
Chiranjeevi : అఖిల్ అక్కినేని నటించిన తాజా చిత్రం లెనిన్. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ చిత్రంలో అఖిల్ నటనపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం అఖిల్ నటనతో పాటు చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. తాను ఈ చిత్రాన్ని ఇంకా చూడలేదని అయినప్పటికి కూడా అందరూ చెబుతుంటే ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
‘లెనిన్ గురించి అద్భుతమైన విషయాలు వింటున్నాను. అందరి నుంచీ లభిస్తున్న ఏకగ్రీవ ప్రశంసలు, ముఖ్యంగా అఖిల్ నటనకు దక్కుతున్న ఆదరణ చూసి చాలా సంతోషంగా ఉంది. అఖిల్ నాకు మరో కొడుకు లాంటివాడు. ప్రతి సినిమాతోనూ అతను ఎదుగుతుండటం చూడటం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
Maa Inti Bangaram OTT Date : ఓటీటీలోకి సమంత ‘మా ఇంటి బంగారం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నా ప్రియ మిత్రుడు నాగార్జునకు, అలాగే చిత్ర బృందానికి అభినందనలు. త్వరలోనే లెనిన్ సినిమా చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ చిత్రం మరింత విజయం సాధించాలని కోరుకుంటున్నాను.’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
Hearing wonderful things about #Lenin. Delighted by the unanimous appreciation, especially for @AkhilAkkineni8’s performance. Akhil is very dear to me, like another son and it’s a joy to see him grow with every film.
Congratulations to my dear friend @iamnagarjuna, the entire…
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 13, 2026
ఇక చిరంజీవి ట్వీట్‌కు ధన్యవాదాలు తెలుపుతూ నాగార్జున రిప్లై ఇచ్చారు. ‘అఖిల్ పట్ల మీకున్న ఆప్యాయత, లెనిన్ కోసం మీరు తెలిపిన శుభాకాంక్షలు ఈ వేడుకను మరింత చిరస్మరణీయంగా మార్చాయి చిరంజీవి గారూ లెనిన్ సినిమా చూశాక మీ అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తుంటాను.’ అని నాగార్జున తెలిపారు.
Pranavi Manukonda : లెహంగాలో తెలుగు అందం.. ప్రణవి మానుకొండ ఫోటోలు వైరల్..
&
Thank you dear Chiranjeevi Garu, you always been a pillar of support to me and my family.. please do watch the film and I promise you will love it!!🙏 https://t.co/1fev55QCNk
— Nagarjuna Akkineni (@iamnagarjuna) July 13, 2026
