Maa Inti Bangaram OTT Date : ఓటీటీలోకి సమంత ‘మా ఇంటి బంగారం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సమంత నటించిన మా ఇంటి బంగారం ఓటీటీ రిలీజ్ డేట్ (Maa Inti Bangaram OTT Date ) ఫిక్సైంది
Samantha Maa Inti Bangaram streaming on JIOHOTSTAR from july 17th
Maa Inti Bangaram Samantha OTT Date : సమంత నటించిన తాజా చిత్రం మా ఇంటి బంగారం. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. 100 కోట్లు వసూలు చేసిన తొలి నాయిక ప్రాధాన్యం కలిగిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అలాంటి వారికి శుభవార్త ఇది. ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని స్వయంగా ఓటీటీ సంస్థ తమ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. జూన్ 17 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలియజేసింది. ‘ఒక్కొక్కడిని కొడతాం చూడు.. ప్రేమతో అబ్బా..’ అంటూ రాసుకొచ్చింది.
July 17th
Okokkodni kodathamu chudu… Prematho abbaaa ❤️🔥#MaaIntiBangaaram streaming from July 17th on JioHotstar! 💫 #MaaIntiBangaaramOnJioHotstar@Samanthaprabhu2 @TralalaPictures #RajNidimoru #NandiniReddy @himankd @gulshandevaiah @diganthmanchale @gautamitads… pic.twitter.com/0pgDLow1n4— JioHotstar Telugu (@JioHotstarTel_) July 12, 2026
గౌతమి, శ్రీలక్ష్మి, శ్రీముఖి, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి దర్శకుడు, సమంత భర్త రాజ్ నిడిమోరు కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై స్వయంగా సమంత ఈ చిత్రాన్ని నిర్మించింది. పెద్దగా అంచనాలు లేకుండా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుని కుటుంబ ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది.
