Akhil Akkineni : బిగ్ ప్రాజెక్టుపై అఖిల్ డైల‌మా?

అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నెక్స్ట్ సినిమాపై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ మొదలైందట.

Akhil Akkineni next film Rumors

Akhil Akkineni : అఖిల్ అక్కినేని నెక్స్ట్ సినిమాపై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ మొదలైందట. కొత్త దర్శకుడితో భారీ బడ్జెట్‌తో సినిమా చేయాలనే ప్లాన్ గతంలోనే తెరపైకి వచ్చింది. అయితే ప్రాజెక్ట్ స్కేల్, బడ్జెట్, కథపై పూర్తి క్లారిటీ, అలాగే తన మార్కెట్‌కు తగ్గట్టుగా సినిమా వర్క్ అవుతుందా అనే అంశాలపై అఖిల్ మరోసారి ఆలోచిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.

ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమా అంటే కేవలం విజువల్స్, యాక్షన్ మాత్రమే కాకుండా కథలో బలమైన ఎమోషన్, కమర్షియల్ కనెక్ట్ కూడా ఉండేలా అఖిల్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

The Paradise collections : బాక్సాఫీస్ వ‌ద్ద ది ప్యార‌డైజ్ సునామీ.. మూడు రోజుల్లో ఎంతంటే?

ఇప్పటికే కొన్ని కథలు, స్క్రిప్ట్ డిస్కషన్స్ జరిగినప్పటికీ ఫైనల్ డెసిష్ తీసుకునే ముందు మరింత వర్క్ చేయాలని అఖిల్ భావిస్తున్నాడట. దర్శకుడి విజన్, మూవీ బడ్జెట్, షూటింగ్ టైమ్‌లైన్ వంటి అంశాలపై క్లారిటీ వచ్చిన తర్వాతే ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలని చూస్తున్నారట.

అయితే ఇది సినిమా నుంచి పూర్తిగా తప్పుకోవడం కాదని, ప్రాజెక్ట్‌ను మరింత పక్కాగా రూపొందించేందుకు జరుగుతున్న అంతర్గత చర్చలేనని అంటున్నారు. మరి ఈ భారీ ప్రాజెక్ట్ అదే కాంబినేషన్‌లో ముందుకు వెళ్తుందా.? లేక అఖిల్ మరో కథను ఎంచుకుంటాడా.? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.