The Paradise collections : బాక్సాఫీస్ వద్ద ది ప్యారడైజ్ సునామీ.. మూడు రోజుల్లో ఎంతంటే?
నాని నటించిన ది ప్యారడైజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను (The Paradise collections) సాధిస్తుంది.
Nani The Paradise 3 days collections
The Paradise collections : నాని నటించిన ది ప్యారడైజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తుంది. మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 136 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా చిత్ర బృందం తెలియజేసింది.

సెప్టెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షక్షుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. కాగా.. తొలి రోజు ఈ చిత్రం 88 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించగా రెండు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక నేడు ఆదివారం కావడంతో ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
Priyanka : హాఫ్ శారీలో సీరియల్ నటి ప్రియాంక.. ఫోటోలు..
ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ ఈ మూవీని నిర్మించారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపుదిద్దుకోగా అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు. కయాదు లోహర్ కథానాయికగా నటించగా మోహన్ బాబు, సోనాలి కుల్కర్ణి, ఈశ్వరీ రావు, సంపూర్ణేశ్ బాబు, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో పోషించారు.
It is JADAL ZAMANA at the box office 🔥🔥#TheParadise collects 136 CRORES+ GROSS WORLDWIDE in 3 days ❤🔥❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/XTkG9ueWdvNatural Star @NameisNani in an @odela_srikanth cinema ❤️🔥
An @anirudhofficial musical 🎼@themohanbabu @11Lohar… pic.twitter.com/6H0IKnAmxf— SLV Cinemas (@SLVCinemasOffl) September 27, 2026
