Akkineni Family
Akkineni Family : రెండు తెలుగు రాష్ట్రాల కుటుంబాలు సంక్రాంతి పండగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సినిమా సెలబ్రిటీలు కూడా సంక్రాంతి పండగను తమ కుటుంబాలతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పలువురు సినీ సెలబ్రెటీలు సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.(Akkineni Family)
అయితే అక్కినేని ఫ్యామిలీ మాత్రం తమ సంక్రాంతిని అన్నపూర్ణ స్టూడియో ఉద్యోగులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. అన్నపూర్ణ స్టూడియోలో ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ ని నిర్వహించారు. అన్నపూర్ణ స్టూడియో ఉద్యోగులు అంతా ఫ్యామిలీలతో సహా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలకు అక్కినేని ఫ్యామిలీ కుటుంబంతో హాజరైంది.
అక్కినేని ఫ్యామిలీ అన్నపూర్ణ స్టూడియో ఉద్యోగులతో కలిసి చేసుకున్న సెలబ్రేషన్స్ ని వీడియో రూపంలో షేర్ చేసారు. అక్కినేని ఫ్యామిలీ వారి ఉద్యోగులకు, ఫ్యామిలీలకు ఫొటోలు ఇచ్చారు. దీంతో ఈ ఫొటోలు, వీడియో వైరల్ గా మారాయి. ఈ సంక్రాంతి వేడుకల్లో అక్కినేని ఫ్యామిలీ అన్నపూర్ణ స్టూడియో ఉద్యోగులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు.
ఈ గ్రూప్ ఫొటోలో నాగార్జున , అమల, నాగచైతన్య, శోభిత ధూళిపాళ, హీరో సుమంత్, నాగార్జున అన్నయ్య వెంకట్, నాగార్జున సోదరు నాగ సుశీల, నిర్మాత సుప్రియ, అమల తల్లి, మరికొంతమంది అక్కినేని కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే ఈ వేడుకలకు ఇటీవలే పెళ్లి చేసుకున్న కొత్త జంట అక్కినేని అఖిల్ అతని భార్య జైనాబ్ రవ్జీ హాజరు కాకపోవడం గమనార్హం.
Also See : Ananya Nagalla : సంక్రాంతి స్పెషల్.. ట్రెడిషినల్ లుక్ లో అనన్య నాగళ్ళ అదరగొట్టిందిగా..
అక్కినేని ఫ్యామిలీ అన్నపూర్ణ స్టూడియో ఉద్యోగులతో కలిసి చేసుకున్న సంక్రాంతి సెలబ్రేషన్స్ వీడియో మీరు కూడా చూసేయండి..