Bangarraju: పెద్ద పండక్కి పెద్ద లెక్కలే చూపించాడు బంగార్రాజు. బరిలో భారీ సినిమాలు లేకపోవడంతో కలెక్షన్స్ బాగానే రాబట్టాడు. అక్కినేని హీరోలు టార్గెట్ చేసింది తెలుగు రాష్ట్రాలనే అయినా అదిరిపోయే రికార్డులు సృష్టించి బంగారు బాతుగా మలచుకున్నాడు బంగార్రాజు. పోటీకి మరే సినిమా లేకపోవడం.. సంక్రాంతి సినిమా అంటే అక్కినేని హీరోలు మాత్రమే కనిపించడం బంగార్రాజు సినిమాకి బాగా కలిసి రావడంతో అక్కినేని హీరోలు బంగార్రాజుతో భారీగా సంపాదించుకున్నారు.
Ravi Teja: కరోనా వేవ్‌ను సక్సెస్ వేవ్‌గా మార్చుకున్న మాస్ రాజా!
కొవిడ్ భయానికి పాన్ ఇండియా సినిమాలు సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంటే.. నేనున్నానంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు బంగార్రాజు. పోటీ పెద్దగా లేదు.. బరిలో పెద్ద స్టార్స్ లేరు.. సో అక్కినేని హీరోలు హవా కొనసాగించారు. 39 కోట్ల లక్ష్యంతో సంక్రాంతి బరిలోదిగిన బంగార్రాజు కేవలం మూడు రోజుల్లోనే ఆ లక్ష్యాన్ని సాధించాడు. ఆ తర్వాత ఓ వారం థియేటర్లలో బంగార్రాజు సందడి కనిపించిన ఆ తర్వాత డీలా పడిపోయాడు.
Aadavallu Meeku Joharlu Teaser: కోపం.. బాధ.. టెన్షన్.. ఫ్రస్టేషన్.. ఇరిటేషన్ చూపించే శర్వా!
అప్పటి నుండి ఓటీటీలో ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా ఇప్పుడు బంగార్రాజు ఓటీటీలో వచ్చేందుకు సిద్దమయ్యాడు. ఫిబ్రవరి 18న బంగార్రాజు ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి జీ సినిమాస్ వాళ్లు నిర్మించిన సంగతి తెలిసిందే. కనుక డిజిటల్ రైట్స్ కూడా వారి దగ్గరే ఉన్నాయి. జీ5లో 18 నుంచి బంగార్రాజు సందడి చేయబోతున్నాడు.