Akkineni naga chaitanya and akhil counter to Balakrishna via tweets
Balakrishna : సాధారణంగా సినిమాలతో స్టార్ హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. మా హీరో గ్రేట్ అంటే మా హీరో గ్రేట్ అని ఫ్యాన్స్ కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక ఎవరైనా తమ హీరో గురించి, హీరో ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడితే విపరీతంగా విమర్శలు, ట్రోల్స్ చేస్తారు అభిమానులు. హీరోలు డైరెక్ట్ గా ఇందులో తలదూర్చారు. చాలా వరకు హీరోలు ఫ్యాన్ వార్స్ కి దూరంగానే ఉంటారు. వాళ్ళు కలిసే ఉన్నాం, కలిసే ఉంటాం అని ఎన్ని సార్లు చెప్పినా అభిమానులు మాత్రం ఫ్యాన్ వార్స్ ఆపరు. కానీ ఇక్కడ ఈ హీరోలు చేసిన వ్యాఖ్యలు, ట్వీట్స్ తో ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి.
ఇటీవల బాలకృష్ణ వీరసింహారెడ్డి సక్సెస్ సెలబ్రేషన్స్ లో మాట్లాడుతూ అనుకోకుండా సీనియర్ హీరోల పేర్లు తీసుకొచ్చి రామారావు, రంగారావు, అక్కినేని, తొక్కినేని.. అంటూ మాట్లాడారు. అయితే ఇది కావాలని మాట్లాడింది కాదని ఆ స్పీచ్ చూస్తే ఎవరికైనా అర్ధమవుతుంది. కానీ ఫ్లోలో బాలకృష్ణ అలా మాట్లాడటంతో అక్కినేని అభిమానులు సీరియస్ అయి బాలయ్యపై విమర్శలు, ట్రోల్స్ చేశారు. అయితే దీనిపై అక్కినేని కుటుంబ సభ్యులు ఇవాళ్టివరకు స్పందించలేదు.
కానీ తాజాగా అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ కూడా ఈ ఇష్యూకి సంబంధించి ఒకే ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో.. నందమూరి తారకరామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్ వి రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరచడం, మనల్ని మనం కించపరుచుకోవటమే అని పోస్ట్ చేశారు. దీంతో చైతు, అఖిల్ చేసిన ట్వీట్స్ వైరల్ గా మారాయి. ఈ ట్వీట్స్ ఇప్పుడు ఫ్యాన్ వార్ ని మరింత ఎక్కువ చేశాయి. బాలయ్య ఫ్యాన్స్ కావాలని అనలేదు, బాలకృష్ణ అందరికి గౌరవం ఇస్తారు అని కామెంట్స్ చేస్తుంటే, అక్కినేని ఫ్యాన్స్ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వలేదు అంటూ ఈ ట్వీట్స్ ని షేర్ చేస్తున్నారు. మరి దీనిపై బాలకృష్ణ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి. మొత్తానికి బాలయ్య అనుకోకుండా అన్న మాటలతో, ఈ యువ హీరోలు చేసిన ట్వీట్స్ తో ఇప్పుడు సోషల్ మీడియాలో నందమూరి, అక్కినేని ఫ్యాన్ వార్ నడుస్తుంది.
— Akhil Akkineni (@AkhilAkkineni8) January 24, 2023
— chaitanya akkineni (@chay_akkineni) January 24, 2023