×
Ad

Naga Chaitanya-Clax: క్లాక్స్ కథ చైతూకి బాగా నచ్చేసిందట.. మహారాజ టైపులో.. పాటలు, ఫైట్లు గట్రా..

అక్కినేని నాగ చైతన్య దర్శకుడు క్లాక్స్(Naga Chaitanya-Clax) తో కొత్త సినిమా చేయబోతున్నాడు.

Akkineni Naga Chaitanya Doing his next movie with director Clax

Naga Chaitanya-Clax: అక్కినేని నాగ చైతన్య తండేల్ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. చందు మొండేటి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. రూ.50 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి ఈ ఇయర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే, ఈ సినిమా తరువాత నుంచి తన సినిమాల సెలక్షన్స్ ని పూర్తిగా మార్చుకున్నాడు నాగ చైతన్య. రెగ్యులర్ సినిమాలు కాకుండా సరికొత్తగా ఉండే సినిమాలు చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.

Rewind 2025: 2025లో పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే.. అందుకే చాలా స్పెషల్ అంట..

ఈ నేపధ్యంలోనే తాజాగా ఒక దర్శకుడికి అవకాశం ఇచ్చాడట నాగ చైతన్య. ఆ దర్శకుడు మరెవరో కాదు క్లాక్స్(Naga Chaitanya-Clax). ఈ దర్శకుడు గతంలో ‘బెదురులంక 2012’ అనే సినిమా చేశాడు. కార్తికేయ గుమ్మికొండ హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ దర్శకుడు ఈమధ్యే నాగ చైతన్యకు ఒక పాయింట్ ను వినిపించగా చైతూ చాలా ఎగ్జైట్ అయ్యాడట. వెంటనే ఫుల్ కథను రెడీ చేయాలనీ చెప్పాడట. రీసెంట్ గా ఫుల్ కథను వినిపించగా చాలా బాగా నచ్చేసిందట. వెంటనే ఈ సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడట.

ఇక్కడ మరో విశేషం ఏంటంటే, ఈ కథలో రెగ్యులర్ హీరోల తాలూకు ఎలివేషన్ ఫైట్స్, సాంగ్స్ ఉండవట. కేవలం కథ ప్రకారమే వెళుతుందట మూవీ. అందుకే ఈ సినిమా కథ బాగా నచ్చి ఓకే చేశాడట నాగ చైతన్య. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు కలిసి ఈ డిఫరెంట్ ప్రాజెక్టును నిర్మించనున్నాయని టాక్. కొత్త సంవత్సరంలో సరికొత్తగా ఈ సినిమా మొదలుకానుంది టాక్. ఇంకా ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.