Naga Chaitanya: ఇప్పుడిప్పుడే మంచి సినిమాలు పడుతున్నాయ్.. మళ్ళీ ఆ డైరెక్టర్ తో అవసరమా?
మరోసారి తమిళ దర్శకుడితో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్న నాగ చైతన్య(Naga Chaitanya).
- V Santhosh Kumar
- Updated on- May 19, 2026 / 03:32 PM IST
Akkineni Naga Chaitanya is planning a movie with Tamil director Lingusamy
- తండేల్ వంద కోట్ల భారీ హిట్
- వృషకర్మ పీరియాడిక్ మూవీ త్వరలోనే
- లింగుస్వామితో సినిమాపై ఫ్యాన్స్ ఆందోళన
Naga Chaitanya: యువసామ్రాట్ నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత ఉత్తమమైన దశను ఆస్వాదిస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘తండేల్’ సినిమాతో ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ భారీ విజయంతో జోరుమీదున్న చైతన్య, ప్రస్తుతం ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ అనే భారీ పీరియాడిక్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘వృషకర్మ’ చిత్రం తర్వాత నాగచైతన్య(Naga Chaitanya) చేయబోయే తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు లింగుస్వామితో చైతన్య ఒక కొత్త సినిమా చేయబోతున్నాడనే టాక్ ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రావాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. అయితే ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ సెట్ కాబోతుండటంపై టాలీవుడ్‌లో సరికొత్త చర్చకు దారితీసింది.
ఈ వార్త బయటకు రావడంతో నాగచైతన్య అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు లింగుస్వామి ట్రాక్ రికార్డ్ ఇటీవల కాలంలో అస్సలు బాలేదని, ఆయన చేసిన గత సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయ్యాయని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఫామ్‌లో లేని దర్శకుడిని ఎవరు పట్టించుకోవడం లేదని, ఇలాంటి సమయంలో ‘తండేల్’ లాంటి వంద కోట్ల హిట్‌తో ఇప్పుడిప్పుడే మంచి ఫామ్‌లోకి వచ్చిన చైతన్యకు మళ్లీ ఆ డైరెక్టర్‌తో సినిమా అవసరమా అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ మాట విని లింగుస్వామి సినిమాను క్యాన్సిల్ చేసుకుంటాడా లేదా అనేది చూడాలి.
