Akkineni sobhita mass steps as a bride on her wedding
Sobhita Dhulipala : అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ఈ నెల 4న పెళ్లి బందంతో ఒక్కటయ్యారు. గత రెండు సంవత్సరాల నుండి ప్రేమలో ఉన్న ఈ జంట ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిపించాడు టాలీవుడ్ కింగ్ నాగార్జున. నాగ చైతన్యకి ఇది రెండో పెళ్లి అన్న సంగతి శోభితకి తెలుసు. అయినప్పటికి చైతూను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
Also Read : Mohan Babu : రిపోర్టర్ పై మోహన్ బాబు దాడి.. మూడుచోట్ల విరిగిన ఎముకలు..
నాచైతన్య అంటే శోభితకి చాలా ఇష్టమట. ఈ పెళ్లికోసం తను ఎంతో వెయిట్ చేసిందట. నాగచైతన్యతో పెళ్లి జరుగుతున్న సమయంలో కూడా చాలా ఎమోషనల్ అయ్యింది శోభిత. తాజాగా తనుపెళ్లి కూతురు అవుతున్న సమయంలో డాన్స్ వేసింది. ఆ హ్యాపీ మూమెంట్స్ కి సంబందించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ‘శ్రద్ధా, నాకు పెళ్లవుతోంది.. నాకు సిగ్గేస్తోంది’ అంటూ తన స్నేహితురాలికి చెబుతూ, మాస్ స్టెప్పులు వేసింది.
దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా నాగచైతన్య, శోభిత వివాహం అన్న పూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా జరిగింది. వీరి వివాహానికి పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా వచ్చారు. నాగార్జున క్లోజ్ ఫ్రెండ్ చిరంజీవి కూడా వచ్చాడు. వీరి పెళ్లికి సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.