విజయ్ ఆంటోని, అరుణ్ విజయ్, షాలిని పాండే, అక్షర హాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘జ్వాల’ రష్యాలో షూటింగ్ జరుపుకుంటోంది..
విజయ్ ఆంటోని.. బిచ్చగాడు సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ, తనకొచ్చిన గుర్తింపుని నిలబెట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. వరస ఫ్లాపులతో తెలుగులో అతని మార్కెట్ అమాంతం పడిపోయింది. ఇప్పుడు విజయ్ ఆంటోని ఫస్ట్ టైమ్ తెలుగులో స్ట్రైట్ సినిమా చేస్తున్నాడు.
అమ్మ క్రియేషన్స్, శరవంత్ రామ్ క్రియేషన్స్, నవీన్ దర్శకత్వంలో, విజయ్ ఆంటోని, అరుణ్ విజయ్ హీరోలుగా, ‘జ్వాల’ అనే సినిమాని నిర్మిస్తున్నాయి. టి.శివ నిర్మాత. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్, షాలిని పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అక్షర హాసన్ కూడా నటిస్తుంది. రష్యాలో పది రోజుల పాటు జరుగబోయే షెడ్యూల్‌లో అక్షర పాల్గొనబోతోంది.
మాస్ అండ్ కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్న ‘జ్వాల’ విజయ్ ఆంటోనికి తెలుగులో ఫస్ట్ ఫిలిం కాగా, ‘బ్రూస్‌లీ’, ‘సాహో’ తర్వాత అరుణ్ విజయ్ నటిస్తున్న సినిమా కావడం విశేషం. తమిళ్‌లోనూ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. నాజర్, ప్రకాష్ రాజ్, మీరా మిథున్, కలైయరసన్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు.