Aarav Bhatia : బాలీవుడ్ పిల్లలంతా ఒకవైపు.. ఈ హీరో కొడుకు ఒకవైపు.. జస్ట్ 4500 జీతానికి పని..

స్టార్ కిడ్స్ లో ఇప్పుడు అక్షయ్ కుమార్ తనయుడు ఆరవ్ భాటియా వైరల్ గా మారాడు. (Aarav Bhatia)

  • Published on- April 20, 2026 / 08:40 PM IST

Aarav Bhatia

Aarav Bhatia : బాలీవుడ్ స్టార్ కిడ్స్ అంటే ఎలా ఉంటారో అందరికి తెలిసిందే. ఫుల్ ఫ్యాషన్ తో, పార్టీలు చేసుకుంటూ, సినిమా, క్రికెట్ సర్కిల్స్ లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తారు. డబ్బులకు కొదవలేదు. స్టార్ కిడ్స్ పేరుతో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ తెచ్చుకొని జస్ట్ ప్రమోషన్స్ చేసుకుంటూ సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. కష్టపడకుండా ఖాళీగా ఉండే స్టార్ కిడ్స్ కూడా ఉన్నారు.

కానీ కొంతమంది స్టార్ కిడ్స్ మాత్రం తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని సొంతగా వర్క్ చేస్తారు. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది స్టార్ కిడ్స్ ఉన్నారు. అలాంటి బాలీవుడ్ స్టార్ కిడ్స్ లో ఇప్పుడు అక్షయ్ కుమార్ తనయుడు ఆరవ్ భాటియా వైరల్ గా మారాడు.

Also Read : Eeshaa Rebba Birthday Celebrations : ఈషారెబ్బ బర్త్ డే.. కూచిపూడితో సెలబ్రేషన్స్.. ఫొటోలు..

అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా జంట తనయుడు ఆరవ్ భాటియా. ఇతను తలుచుకుంటే వేరే స్టార్ కిడ్స్ లాగే హీరోగా ఎంట్రీ ఇవ్వొచ్చు. కానీ అతను మాత్రం ప్రస్తుతం 4500 రూపాయల జీతానికి పనిచేస్తున్నాడు. సెలబ్రిటీ లైఫ్ కి, బాలీవుడ్ కి దూరంగా సింపుల్ జీవితాన్ని గడుపుతున్నాడు.

ఆరవ్ లండన్ వెళ్లి ఫ్యాషన్ డిజైనింగ్ లో పలు కోర్సులు చేసి వచ్చాడు. భవిష్యత్తులో బాలీవుడ్ లో ఫ్యాషన్ డిజైనర్ అవ్వోచ్చేమో. కానీ ప్రస్తుతం మాత్రం ఓ సంస్థ తరపున నార్త్ లో పలు గ్రామాలకు వెళ్లి అక్కడ లోకల్ ఫ్యాషన్స్ పై అధ్యయనం చేస్తున్నాడు. ఇందుకు గాను ఆ సంస్థ నుంచి అతనికి కేవలం 4500 స్టైఫెండ్ మాత్రమే వస్తుంది. అతనికి నచ్చిన పని కోసం, వర్క్ ఇంకా నేర్చుకోవాలని అంత తక్కువ జీతానికి పనిచేస్తున్నాడు ఆరవ్ భాటియా. దీంతో అంతా ఇతన్ని అభినందిస్తున్నారు. సెలబ్రిటీ లైఫ్ ఉన్నా ఇలా సింపుల్ గా ఉంటున్నాడని ఆశ్చర్యపోతున్నారు. భవిష్యత్తులో బాలీవుడ్ లో స్టార్ ఫ్యాషన్ డిజైనర్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Also Read : Karunakaran : ఎనిమిదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ డైరెక్టర్.. బెల్లంకొండ హీరోతో..